రోడ్డంతా బురద  స్కూల్​ బస్సుకు ప్రమాదం

మేళ్లచెరువు, వెలుగు: మండల కేంద్రానికి చెందిన ఓ స్కూల్ బస్సుకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది.  స్కూల్ బస్సు చింతలపాలెం నుంచి స్టూడెంట్లను ఎక్కించుకుని మేళ్లచెరువు వస్తుండగా రైల్వే అండర్ పాస్ సమీపంలో అదుపు తప్పింది. ఈ దారి మట్టితో బురదమయంగా మారడంతో బస్సు టైర్లు  అదుపు జారి పోవడంతో పొలాల సమీపంలోకి వెళ్లి, మట్టిలో దిగబడింది.

బస్సు ఓ పక్కకు ఒరగడంతో డ్రైవర్,స్టూడెంట్లు అప్రమత్తమై బస్సు నుంచి  కిందకు దిగారు. ఎవరికీ ఎమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ల సాయంతో బస్సును బయటకు లాగారు. కొన్నేళ్లు గా ఈ రోడ్ వెంట ప్రమాదాలు జరుగుతున్నాయి.తక్షణమే రోడ్ కు రిపేర్ చేయించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.