నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ శివారులో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బురదలో చిక్కుకొని ఓ వైపు ఒరిగి నిలబడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది పిల్లలున్నారు. బస్సు గనక బోల్తా పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు స్థానికులు.
బుధవారం జూలై24, 2024న నిజామాబాద్ పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం పట్టణ శివారులోని నవ్యభారతి గ్లోబల్ మల్టీ ఇంటర్నేషన్ స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులను ఇండ్లకు చేర్చేందుకు వెళ్తుండగా గంగస్థాన్ 2 వద్ద అదుపుతప్పి బురదలో చిక్కుకొని ఓ పక్క ఒరిగింది. అనుభవం లేని డ్రైవర్లతో బస్సును నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.