నీట్ కేసులో జూలై 8న సుప్రీం కోర్టు విచారణ

NEET అండర్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, ఒకే సెంటర్ ఎగ్జామ్ రాసిన 67 మందికి ఫస్ట్ ర్యాంకులు ఎలా వచ్చాయిని ఆరోపణలు వస్తున్నాయి. దేశమంతా ఇదే చర్చ, కొన్ని సెంటర్లో పేపర్లు మారిపోవడం, టైంకు ఎగ్జామ్ జరగకపోవడంతో నీట్ నిర్వాహణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్ నిర్వాహణ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్టలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం జూలై 8 తేదీని నిర్ణయించింది.

 సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌తో పాటు, దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి నీట్-యూజీపై కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు జూలై 8న విచారించనుంది. 

24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రాశారని చెప్పారు. వీరిలో 15వందల 63 మంది విద్యార్థులకు సంబంధించిన సమస్యను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలో నీట్, JEE, CUET పరీక్షలను NTA విజయవంతగా నిర్వహిస్తోందన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.  

మరోవైపు 15వందల 63 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను తొలగిస్తున్నట్లు NTA తెలిపింది. వీరికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈమెయిల్, మెసేజ్ ల ద్వారా సమాచారం అందిస్తామని తెలిపింది NTA.