ఎస్బీఐ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్​తో ఏసీ దగ్ధం

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలోని ఎస్బీఐ బ్యాంకులో శనివారం షార్ట్ సర్క్యూట్ తో ఏసీ దగ్ధమైంది. ఉదయం బ్యాంకు ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. 

వెంటనే స్పందించిన విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.