ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ

  • రూ. --24 లక్షల 92 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు
  • క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు

బాల్కొండ, వెలుగు:  నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని  ఎస్బీఐ ఏటీఎంను  ధ్వంసం చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లారు.   మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు వైట్ కారులో వచ్చి లోనికి చొరబడ్డారు.  గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులోని రూ. 24,92,600 నగదును దొంగిలించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీ లు చేపట్టారు.  క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఏటీఎం చానల్ మేనేజర్ అవదూత నితిన్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఎస్సై శంకర్ తెలిపారు. ఎప్పుడు రాకపోకలతో బిజీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు చోరీ కావడంతో వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు.