నకిలీ పాస్ పోర్టు కేసులో ఎస్బీ ఏఎస్సై అరెస్ట్

నిజామాబాద్: నకిలీ పాస్ పోర్టు కేసులో ఎస్బీ ఏఎస్సైని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  మాక్లూర్, నవీపేట ఎస్బీ ఇన్‌ఛార్జ్ గా లక్ష్మణ్‌ పనిచేస్తున్నారు. సీఐడీ అధికారులు నిజామాబాద్​ సిటీలోని గంగస్థాన్‌లో ఉన్నలో  తన నివాసం నుంచి లక్ష్మణ్ ను ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో భీంగల్ కేంద్రంగా లైసెన్స్‌లు లేని ట్రావెల్స్ నిర్వాహకుల్లో భయాందోళన మొదలైంది.

కాగా, భీంగల్ మండల కేంద్రంలో సీబీసీఐడీ టీం సుమారు గంటన్నర పాటు ముచ్కూర్ రోడ్డులో గల నకిలీ పాస్ పోర్టుల కేసు నిందితుడు సుభాష్ ఇంట్లో సోదాలు నిర్వహించి అతని వద్ద నుండి ల్యాప్ టాప్, ఇతర విలువైన సమాచారం గల పత్రాలు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. దాంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని వెళ్లిన సీఐడీ బృందం ఇంట్రాగేట్ చేసింది.ఈ సమచారంతోనే లక్ష్మణ్‌ను అరెస్ట్​ చేసినట్లు తెలిసింది.