హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి, దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందిన సావిత్రి జిందాల్ గెలుపొందారు. ఆమె బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె మొత్తం 49,231 ఓట్లు సాధించారు.
తన గెలుపు అనంతరం ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ..ఎక్స్‌లో “అభార్ హిసార్ పరివార్” (హిసార్ కుటుంబానికి కృతజ్ఞతలు) అని పోస్ట్ చేశారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏండ్ల సావిత్రి మూడోసారి హిసార్ నుంచి గెలిచారు. 2005, 2009, 2013లో కాంగ్రెస్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.