బ్యాటరీ లైఫ్​.. ఇలా సేవ్​ చేయొచ్చు

వేల రూపాయలు ఖర్చు చేసి స్మార్ట్​ ఫోన్​ కొంటారు. ఎడాపెడా వాడితే సరిపోదు అప్పుడప్పుడు దాని బ్యాటరీ కెపాసిటీ కూడా చెక్ చేసుకుంటుండాలి. ఎంత మంచి ఫోన్​ అయినా ఎక్కువగా వాడితే బ్యాటరీ లైఫ్​ తగ్గిపోవడం ఖాయం. కాబట్టి బ్యాటరీ లైఫ్​ పెరగాలి, ఎక్కువ రోజులు వాడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

స్మార్ట్​ ఫోన్స్​లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఎక్కువగా వాడితే వాటి కెపాసిటీ తగ్గిపోతుంది. దాన్ని ఆపడం మన చేతుల్లో ఉండదు. కానీ... బ్యాటరీ త్వరగా పాడవ్వకుండా  జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తల వల్ల బ్యాటరీ లైఫ్​ పెరుగుతుంది కూడా. అవేంటంటే..
 

  •     విపరీతమైన వాతావరణంలో అంటే.. వేడి లేదా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్​ ఫోన్స్​ వాడకూడదు.
  •     ఫోన్​ ఛార్జింగ్​కి పెట్టేటప్పుడు ఫోన్​ కేస్​ తీసి పక్కన పెట్టాలి. అప్పుడు ఫోన్​ వేడెక్కదు.
  •     ఆప్టిమైజ్డ్​ బ్యాటరీ ఛార్జింగ్​ అనే ఆప్షన్​ని ఫోన్​లో ఎనేబుల్ చేసుకోవాలి. 80 శాతం ఛార్జింగ్ ఉన్నా ఫోన్​ వాడే అవసరం లేనప్పుడు ఇలా చేయడం బెటర్. 
  •     ఛార్జింగ్ లిమిట్ 25 శాతం వరకే పెట్టుకోవాలి. అంతకంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. 
  •     5జీ కంటే 4జీ ఎల్​టీఈ ఆన్ చేసి పెట్టుకోవాలి. అలాగే రిఫ్రెష్ రేట్ 60 హెచ్​జెడ్​కి తీసుకెళ్లాలి. 
  •     ఎక్కువ పవర్ వాడుకునే కొన్ని యాప్స్​ వాడితే బ్యాక్​గ్రౌండ్ యాక్టివిటీ లిమిట్​లో ఉంచుకోవాలి.