ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఇందూరు లోని 50 వ డివిజన్ లో ఉన్న నల్ల హనుమాన్ దేవాలయంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు.అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, ప్రకాశ్, సుధాకర్, రమేశ్, వంశీ, నర్సింగ్, నర్సయ్య పాల్గొన్నారు.