Diwali 2024:. నరకాశురుడి తల్లి సత్యభామే.. ఈ విషయం మీకు తెలుసా..

దివాళి... దీపావళి..  పండుగ వచ్చిందంటే చాలు.. పిల్లలు.. పెద్దలు వారం రోజుల ముందు నుంచి హడావిడి మొదలు పెడతారు.  టపాకాయల సందడి.. దీపాలు వెలిగించడం .. ఇలా అందరూ హడావిడి చేస్తారు. లోకాన్ని రక్షించే దేవతలకు నరకాశురుడి పీడ విరగడైందని..అందుకే దీపావళి పండుగ ..అని.. అందరికీ తెలిసిందే.. కాని నరకాశురుడి తల్లి సత్యభామే అతడిని చంపిందని పురాణాలు చెబుతున్నాయి. 

కార్తీక మాసం వస్తూనే దీపావళి పండగను తెచ్చింది.    త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు ఆశ్వయుజ మాసం అమావాస్య  రోజున   తిరిగివచ్చారని  చెపుతారు.   దీపాలు వెలిగిస్తూ.. టపాకాయలు కాలుస్తూ సందడి చేస్తారు. మరో కథనం ప్రకారం.. చెడుపై మంచి విజయం సాధించిన రోజని.... దేవతలకు నరకాశురుడి బాధ తొలగిపోయిందని.. అప్పటి నుంచి వెలుగులు విరజిమ్ముతాయని.. దీపాలను వెలిగిస్తూ.. టపాసులు కాలుస్తూ  ప్రజలు సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.  కాని నరకాశురుడి తల్లి సత్యభామే అతడిని చంపిందని పురాణాలు చెబుతున్నాయి. 

ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. నరకాశురుడిని విష్ణుమూర్తి వధించాడు. ఆయన హిరణ్యాక్షుడిని సంహరించేందుకు వరాహస్వామి అవతారం ఎత్తాడు.  అప్పుడు వరాహస్వామి అవతరాంలో ఉన్న విష్ణుమూర్తి భూదేవిని వివాహం చేసుకున్నాడు.  అప్పుడు భూదేవి గర్భం దాల్చింది.  అలా  భూదేవికి.. వరాహస్వామికి కలిగిన సంతానమే.. నరకాశురుడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని  తన కుమారుడికి  కామరూప నగరమైన ప్రాగ్జ్యోతిష్య  దేశాన్ని పాలించే బాధ్యతను అప్పగిస్తూ  శక్తి అనే ఆయుధాన్ని.. దివ్య రథాన్ని వరంగా ఇచ్చాడు. 

ఇలా జరుగుతుండగా... నరకుడిడికి  బాణుడు అనే రాక్షసుడితో స్నేహం ఏర్పడింది.  ఇంకేముంది.. అప్పటి వరకు ఎంతో మంచి ప్రవర్తన కలిగిన నరకాశుడుడిని... అతని స్నేహితుడు బాణుడు చెప్పిన మాటలు వినడంతో  చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.  అప్పటి నుంచి ప్రజలను.. మునులను.. దేవతలను హింసించడం మొదలు పెట్టాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి..  ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యదేవి ఆలయంలో పూజ చేసేందుకు వెళుతున్నాడు.  అప్పుడు నరకాశురుడు అహంకారంతో... రాజు అనే గర్వంతో దేవాలయం తలుపులు మూసి వేయించాడు.  దీంతో వశిష్ఠ మహర్షి.. ఓరీ మూర్ఖుడా.. నీవు .. నీ తల్లి చేతిలోనే మరణిస్తావని శాపం ఇచ్చాడు.  మహర్షుల శాపం ఊరికే పోదని నరకాశురుడికి ముందే తెలుసు కాబట్టి.. బ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేయడం..   దేవతలు, రాక్షసుల నుంచి మరణం లేకుండా వరం పొందాడు.

అలా వరం పొందిన నరకాశురుడు గర్వంతో.. దేవతలను.. మునులను .. నానా రకాలుగా చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు.  మంచి..  చెడులను పట్టించుకోకుండా.. దేవతలను హింసిస్తూ.. వారితో యుద్దం చేశాడు.  ఇంద్రాద్రి దేవతలను జయించి.. ఇంద్రుడి పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రాజు తలచుకుంటే .. ఏదైనా సాధ్యమే అన్నరీతిలో 16వేల మంది రాజకన్యలను చెరపట్టాడు.  దీంతో నరకాసురుడి నుంచి తమను కాపాడమని.. విష్ణువు అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడికి ఇంద్రాది దేవతలు  మొరపెట్టుకున్నారు.   అప్పుడు తాను సత్యభామను వివాహం చేసుకున్నప్పుడు ఆమె  నరకాశురుడిని వధిస్తుందని .. గత జన్మలో సత్యభామ కుమారుడే నరకాశురుడిని .. ఆయన జన్మవృత్తాంతం వివరిస్తాడు.

ఎంతైనా తల్లి ప్రేమకు ఏదీ సాటిరాదని గ్రహించిన ...  విష్ణువు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు  అభయం ఇస్తూ... నరకాశురుడిపై యుద్దానికి వెళతాడు.  అప్పుడు వరబలం ఉన్న నరకాశురుడితో .. శ్రీకృష్ణుడు యుద్దం చేసి అలసిపోవడం.. కృష్ణుని రథం కూలబడింది.  ఇలా తన భర్త నిస్పహాయ స్థితి పరిస్థితి చూసిన సత్యభామ .. ఆయుధాలు చేపట్టి  నరకాసుడితో యుద్ధం చేసి వధించింది. బాణుడితో స్నేహం చేయకముందు ఆయన చేసిన మంచిపనుల వలన.. తనకు వశిష్ఠుడు ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చి... ఇక తనకు మరణమే శరణ్యమని భావించి   తన తల్లి చేతిలో మరణిస్తున్నట్లు అర్ధం చేసుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. ఆరోజున ( అక్టోబర్​ 30)  హిందువులు నరక చతుర్దశిగా జరుపుకుంటారు.

నరకాశురుడు మరణించాడనే వార్త ముల్లోకాలకు తెలియడంతో మరునాడు ( ఆశ్వయుజమాసం అమావాస్య ) ప్రజలు.. దేవతలు.. సంబరాలు చేసుకున్నారు.  సహజంగా అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది కావున.. ఆరోజున దీపాలు.. వెలిగిస్తూ.. టపాకాయలు కాల్చుతూ..  వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో దీపాల పండుగ కాస్తా...  దీపావళి పర్వదినంగా మారింది.