Microsoft: AI పవర్డ్ కోపిలాట్ + ల్యాప్టాప్లు వచ్చేశాయి 

మైక్రోసాఫ్ట్ తన కొత్త కోపిలాట్ +పీసీలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. AI ఎరాకోసం రూపొందించబడిన వేగవంతమైన విండోస్ పీసీలు అయిన సర్ఫేష్ ల్యాప్ టాప్, సర్ఫేస్ ప్రోలు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ లు రూ. 82 వేల ధరతో లభిస్తున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో microsoft.com, Microsoft experience centreలలో అందుబాటులో ఉన్నాయి. 

 సర్పేస్ ల్యాప్ టాప్ (7వ ఎడిషన్ ) 64GB RAM , 13.8 అంగుళాల డిస్ ప్లే, Snapdrogon@X Elite (12కోర్) ప్రాసెసర్, 1TB SSD స్టోరేజ్ తో నలుపు రంగులో రూ. 2లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

 సర్పేస్ ల్యాప్ టాప్ (7వ ఎడిషన్ ) 64GB RAM , 15 అంగుళాల డిస్ ప్లే, Snapdrogon@X Elite (12కోర్) ప్రాసెసర్, 1TB SSD స్టోరేజ్ తో నలుపు రంగులో రూ. 2.8లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

ఈరోజు Copilot+PC ల ప్రారంభంతో Windows  కోసం కొత్త శకానికి నాంది పలికింది. ఈ కొత్త AI బేస్డ్ డివైజెస్ ప్రజలను మరింత ప్రాడక్టివిటీ, క్రియేటివిటీని పెంచు తా యని..మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. 

కొత్త సర్పేస్ ల్యాప్ టాప్ , సర్ఫేస్ ప్రో స్నాప్ డ్రగన్ X సిరీస్ గతంలోని ప్రాసెసర్లకంటే మరింత శక్తివంతమైనది, వేగవంతమైన పనితీరు, రోజంతా బ్యాటరీ లైఫ్, పవర్ ఫుల్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్(NPU) తో సరికొత్త AI అనుభవాలను అందిస్తుంది. 

Small launguage Modle  లతో అజూర్ క్లౌడ్ లో నడుస్తున్న Large Language Modelలకి కనెక్ట్ చేయబడి, మెరుగుపర్చబడిన Copilot+PC లు ఇంతకుముందు లేనివిధంగా పనిచేస్తాయని కంపెనీ చెపుతోంది.