కరీంనగర్ జిల్లా లైబ్రరీలకు కొత్త చైర్మన్లు 

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌గా సత్తు మల్లేశ్‌ ఆదివారం నియమితులయ్యారు. చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన ఆయన గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.  పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే మల్లేశ్‌కు లైబ్రరీ సంస్థ చైర్మన్‌ పదవి దక్కింది. 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా లైబ్రరీ చైర్మన్​గా నాగుల సత్యనారాయణగౌడ్​ నియమితులయ్యారు. పార్టీలో సీనియర్‌‌గా కొనసాగుతున్న  సత్యనారాయణ నియామకంపై కాంగ్రెస్​ లీడర్లు హర్షం వ్యక్తం చేశారు. కాగా గ్రంథాలయం పదవి తనకొద్దని సత్యానారాయణ గౌడ్‌ కాంగ్రెస్‌ అగ్రనేతకు చెప్పినట్లు సమాచారం. తాను 40 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, తనకు రాష్ట్ర స్థాయి పదవి కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.