శాతవాహన వర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ రిలీజ్

కరీంనగర్, వెలుగు:  శాతవాహన యూనివర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వీసీ ఉమేశ్ కుమార్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. 2022 -–23, 2023–-24, 2024 –25 విద్యా సంవత్సరాలకుగానూ పీహెచ్ డీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 

ఉర్దూ, ఎకనామిక్స్ (4), సోషియాలజీ(7), ఉర్దూ (12),  కెమిస్ట్రీ(7), ఫిజిక్‌ (8), బిజినెస్ మేనేజ్ మెంట్(5) విభాగాల్లో మొత్తం  43 సీట్లు ఖాళీగా ఉన్నట్లు, వీటికి పీహెచ్ డీ ప్రవేశాలు కల్పించనున్నట్టు వివరించారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 21లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. యూజీసీ జేఆర్ఎఫ్, నెట్ లేదా 2008కి ముందు ఎంఫిల్ లో అడ్మిషన్ పొంది పూర్తి చేసినవారు అర్హులని వెల్లడించారు.