ఆత్మరక్షణకు పంచ్​లు ఆత్మవిశ్వాసానికి అవేర్నెస్ ​క్లబ్బులు

  • సర్కారు స్కూళ్లలోని అమ్మాయిలకు ‘సర్వ శిక్ష’ స్పెషల్ ​ట్రైనింగ్​ 
  • కొనసాగుతున్న మార్షల్​ ఆర్ట్స్​లో శిక్షణ 
  • గర్ల్ చైల్డ్ ​ఎంపవర్​మెంట్ క్లబ్​ల ద్వారా అన్ని సొసైటీల గురించి అవగాహన 

హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న అమ్మాయిలను చిన్నతనం నుంచే మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచేందుకు ‘సర్వశిక్ష’ చర్యలు తీసుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో వారిని వారు రక్షించుకునేలా సెల్ఫ్​డిఫెన్స్​లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని హైస్కూల్స్, అప్పర్​ప్రైమరీ స్కూళ్లలో చదివే అమ్మాయిలకు ‘రాణీ లక్ష్మీబాయి ఆత్మ రక్ష ప్రక్షిక్షణ్’​ పేరుతో కరాటే, తైక్వాండో, ఉషూ, జూడో, మార్షల్​ఆర్ట్స్​లో తర్ఫీదు ఇప్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని  211 ప్రభుత్వ హైస్కూల్స్, అప్పర్​ ప్రైమరీ స్కూళ్లలో ఈ ట్రైనింగ్​నడుస్తోంది. ఒక్కో స్కూల్​లో మూడు నెలల పాటు...వారానికి 3 సెషన్ల చొప్పున  నెలకు12 సెషన్లు ట్రైనింగ్​ఉంటుంది.  

అన్ని అంశాలపై అవగాహన కోసం...

ఆత్మరక్షణే కాకుండా సమాజం ఎలా ఉంది? దాన్ని ఏ దృష్టి కోణంతో చూడాలి? సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలపై కూడా సర్కారు బడుల్లోని అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని హైస్కూళ్లలో గర్ల్​ చైల్డ్​ఎంపర్​మెంట్ క్లబ్స్​(జీసీఈసీ)లను ఏర్పాటు చేస్తున్నారు. 100 స్కూళ్లలో ఈ జీసీఈసీల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఈ క్లబ్బుల ద్వారా గుడ్​టచ్, బ్యాడ్​టచ్, ఈవ్​టీజింగ్, చైల్డ్​ మ్యారేజెస్, ఫినాన్సియల్​ లిటరసీ, ఆరోగ్యం, హింస తదితర అంశాలపై అవగాహన వచ్చేలా  క్లాసులు చెప్తారు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి? 

ఎలా కంప్లయింట్​చేయాలి? అనేది వివరిస్తారు. ఈ క్లబ్బులకు చైర్మన్​గా హెడ్​మాస్టర్​, మెంబర్లుగా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉండే టీచర్​,14మంది అమ్మాయిలు, స్థానిక పీఎస్​నుంచి లేడీ కానిస్టేబుల్​ఉంటారు. స్కూళ్లలో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఫోన్​నంబర్లను ఏర్పాటు చేయడంతో పాటు, అమ్మాయిలు తమ సమస్యలను తెలియచేయడానికి ప్రత్యేకంగా కంప్లయింట్​బాక్స్​ఏర్పాటు చేస్తారు. కమిటీ ఈ కంప్లయింట్​బాక్స్​ను చెక్​ చేస్తుంది.  

మా కష్టం ఫలిస్తోంది....

అమ్మాయిలు తమను తాము సెల్ఫ్​ప్రొటెక్ట్ చేసుకోవడానికి మార్షల్​ఆర్ట్స్​ఉపయోగపడుతుంది. ఇప్పటికే ట్రైనింగ్​తీసుకున్న వారు మనోధైర్యంతో ఉంటున్నారు. గర్ల్ ఎంపవర్​మెంట్ క్లబ్స్​అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. కెరీర్​గైడెన్స్, స్కూల్స్, ఇండ్లు, బయటి ప్రదేశాల్లో జరిగే గుడ్​టచ్​, బ్యాడ్​టచ్, కన్ఫ్యూజన్​ టచ్​గురించి వివరంగా చెప్తున్నాం. ఇవి అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా ధృడంగా చేస్తున్నాయి. 

– రజిత,  సర్వశిక్షా కో ఆర్డినేటర్​, హైదరాబాద్ జిల్లా