Sankranthi Special : సంక్రాంతి పండక్కి.. ఇంటిని ఇలా ముస్తాబు చేద్దాం

అన్ని పండుగల్లో సంక్రాంతి సమథింగ్ స్పెషల్. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజులు సంతోషాల్ని నింపుతుంది. చాలా మంది ఈ పండగని బయట సెలబ్రేట్ చేసుకునే కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ అంటారు. మరీ ఇంట్లోనే ఆత్మీయులతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే.. ఇంట్లో ఫెస్టివ్ లుక్ మాటేంటి అంటారా! అందుకోసమే ఈ టిప్స్ . 

• పండుగంటే సంబరాలు, సంతోషాలతోపాటు బోలెడు కబుర్లు కూడా. అంతా ఒకచోట చేరినప్పుడు కబుర్లతోనే కాలం గడిచిపోతుంది.అందుకే నలుగురూ కలిసి హాయిగా మాట్లాడుకోవడానికి చెక్క బెంచీలు, బల్లలు వేయాలి. వాటి మీద కుషన్స్ లేదా కలర్ఫుల్ దుపట్టాలు వేస్తే లుక్ బాగుంటుంది. అంత స్పేస్ లేదా... అయితే నేలమీద చాపలు పరిచి, పరుపు వేయాలి. నాలుగువైపులా పూల మొక్కలు పెట్టి, గోడలకి లాంతర్లు వేలాడదీస్తే వింటేజ్ లుక్ వస్తుంది. 

• బంతులు, చామంతులు ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే పండుగ కళ నడిచొస్తుంది. అయితే ఎప్పటిలా రొటీన్ గా కాకుండా .. డిఫరెంట్ షేప్స్ వీటిని గుమ్మానికి అలంకరించాలి. అంటే మామిడి ఆకుల అంచున బంతి పువ్వులు గుచ్చాలి. లేదా నాలుగైదు మామిడాకుల్ని ఒకదానిపై ఒకటి పువ్వులా పేర్చి వాటిపైన బంతిపువ్వులు గుచ్చి గుమ్మానికి వేలాడదీయాలి. గుమ్మానికి రెండువైపులా, ఇంట్లో అక్కడక్కడా నీటి తొట్టెలు పెట్టి వాటిల్లో బంతిపూలు పరిస్తే ఫెస్టివల్ మరింత కలర్ఫుల్ ఉంటుంది. బంతిపూలతో 'హ్యాపీ సంక్రాంతి' అని గుమ్మం సంక్రాంతికి ఇంటి ముస్తాబు ముందు రాయొచ్చు కూడా. అలాగే డైనింగ్ టేబుల్ మధ్యలో ఫ్లవర్ వేజ్లు పెడితే లుక్ బాగుంటుంది. 

• సంక్రాంతికి దీపాల వెలుగులు లేకపోతే ఎలా? పండుగకి ఒకట్రెండురోజులు ముందుగానే ఎలక్ట్రికల్ లైట్స్ పెట్టించుకోవాలి. ఇంటి ఎంట్రన్స్ లో లైట్స్ పెడితే పండుగకి కొత్త కళ వస్తుంది. స్ట్రింగ్ లైట్స్ ని లివింగ్, బెడ్ రూమ్లలో వేలాడదీస్తే ఎలిగెంట్ లుక్ వస్తుంది. పేపర్ లాంతర్లు, ఎగ్ కార్డన్ లాంప్స్, సీ షెల్ లైట్స్ ని కూడా ఫెస్టివల్ డెకరేషన్ లో యాడ్ చేయొచ్చు. అంత ఖర్చు వద్దనుకుంటే గ్లాస్ జార్స్ లో లైట్స్ ని అమర్చొచ్చు. వాటిల్లో క్యాండిల్స్ పెట్టినా మంచి లుక్ వస్తుంది. అలాగే గ్లాస్ జార్స్ లో ఎండుటాకులు కూడా వేసి టీపాయ్ మీద పెట్టొచ్చు. గ్లాస్ జార్స్ పై నక్షత్రం షేప్ ఉండే రేడియం స్టిక్కర్స్ కూడా అతికించొచ్చు. అలాగే గార్డెన్లో లైట్స్తో పాటు షేడెడ్ కానోపీస్ ని పెట్టాలి. 

• పతంగులతో ఇంటీరియర్లో పనిలేదనుకుంటే పొరపాటే. ఫెస్టివ్ లుక్కి వీటిని మించిన డెకరేటివ్ పీస్ మరొకటి లేదు. రంగురంగుల గాలిపటాల్ని ఇంటి గుమ్మం చుట్టూ అతికించొచ్చు. లివింగ్ రూమ్ గోడలపై డిఫరెంట్ షేప్స్ గాలిపటాల్ని వరుసగా బాగుంటుంది. అయితే డెకరేషన్కి డిఫరెంట్ కలర్స్ ఉన్న పతంగుల్ని ఎంచుకోవాలి. కలర్ కాంబినేషన్ని సెట్ చేసుకొని గోడలకి అతికించాలి. అరటి ఆకుల్ని గోడలపై అతికించి.. వాటి మీద గాలిపటాల్ని అమర్చినా బాగుంటుంది. బయట కొనడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే పేపర్ గాలిపటంలా కత్తిరించి అతికించొచ్చు. అలాగే భోగి మంటలు వేసేచోట కూడా కైట్స్ లో ఆర్చ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి బాల్కనీకి గాలి పటాల్ని వేలాడదీసినా లుక్ బాగుంటుంది. 

• సంక్రాంతి అంటేనే రంగుల ముగ్గులు. ఇంటి వాకిట్లో, గుమ్మం ముందు వేసే ముగ్గుల్ని హాల్లోకి కూడా తీసుకురావచ్చు. అయితే పెద్దపెద్ద ముగ్గులకి బదులు సింపుల్గా, రంగులద్దడానికి అనువుగా.. ఉండే ముగ్గులు చూడ్డానికి బాగుంటాయి. వాటి మీద భోగికుండలు పెడితే స్పెషల్ లుక్ వస్తుంది. అయితే భోగి కుండల్ని కాస్త కలర్ఫుల్ డెకరేట్ చేయాలి. వాటి చుట్టూరా పెయింటింగ్స్ వేయాలి. లేదంటే వాటిపై సున్నంతో ముగ్గులు వేసినా, వాటి చుట్టూరా బంతిపూల మాల చుట్టినా ఫెస్టివ్ లుక్ వస్తుంది. వాటిల్లో చెరకు గడలు కూడా పెట్టుకోవచ్చు.