నస్రుల్లాబాద్ మండలంలోని పలు పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ముఖ్యంగా కొన్ని తండాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మండలంలోని బొప్పాస్పల్లి తండాలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. మురుగు కాలువల పక్కన కలుపు మొక్కలు మొలవడంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేక చిన్న పాటి వర్షానికి డ్రైనేజీ నీరు రోడ్డు పై ప్రవహిస్తుంది. దీంతో ఒకవైపు దుర్వాసనతో మరోవైపు దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా స్పెషల్ ఆఫీసర్లు పల్లెలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– నస్రుల్లాబాద్, వెలుగు