Astrology: డిసెంబ‌ర్ 28న కుంభ‌రాశిలోకి శ‌ని.. శుక్రుడు... ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ..డిసెంబ‌ర్ నెల శ‌ని గ్ర‌హం త‌న సొంత రాశి  కుంభ‌రాశిలో కొన‌సాగుతున్నాడు.  డిసెంబ‌ర్ 28 ...అర్ద‌రాత్రి 11.48 నిమిషాల‌కు శుక్రుడు కూడా కుంభ‌రాశిలోకి ప్ర‌వేశిస్తాడు.  శుక్రుడు.. శ‌ని గ్ర‌హాలు క‌లిసి కుంభ‌రాశిలో దాదాపు నెల రోజుల పాటు సంచ‌రిస్తారు. దీని కార‌ణంగా నాలుగు రాసుల వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  పండితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వృష‌భం, తుల‌, మ‌క‌రం. కుంభ రాశుల‌తో.. మిగ‌తా రాశుల వారికి ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయో తెలుసుకుందాం. . . .  

మేషరాశి.. కుంభ‌రాశిలో శుక్రుడు.. శ‌ని గ్ర‌హాలు క‌లిసి సంచ‌రించ‌డం వ‌ల‌న ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.  కోర్టు వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చేసే వారికి.. అనుకుకోకుండా 2025 జ‌న‌వ‌రి రెండో వారంలో  మంచి సంబంధం కుదురుతుంది.  ఉద్యోగ‌స్తుల‌కు ఆర్థికంగా  క‌ల‌సి వ‌స్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టే వారికి ఈ స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది.  ఆదాయం పెరుగుతుంది.  విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగ‌స్తుల‌కు వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంటుంది.  మొండి బ‌కాయిలు వ‌సూల‌వుతాయి. 

వృషభం: శుక్రుడు, శ‌ని.. కుంభ‌రాశిలో సంచ‌రించ‌డం వ‌ల‌న ఈ రాశివారికి  అధ్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని.  ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొందుతారు.  ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్ తో వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంది.  కేరీర్ లో ఉన్న‌త‌స్థానాన్ని పొందుతారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మిమ్మ‌ల‌ను వ్య‌తిరేకించిన వారే మీ స‌హాయాన్ని అర్దిస్తారు.  ఆక‌స్మికంగా ధ‌న‌లాభం పొందుతారు. ప్రేమ‌.. పెళ్లి మొద‌ల‌గు అంశాలు క‌ల‌సి వ‌స్తాయి. 

మిథున రాశిః   కుంభ‌రాశిలో .. శుక్రుడు.. శ‌ని గ్ర‌హాలు సంచారం వ‌ల‌న ..మిధునరాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది.  అయితే ప‌ని ఒత్తిడి.. శ్ర‌మ అధికం అవుతుంది.  కొత్త‌గా ఆదాయ మార్గాలు ఏర్ప‌డుతాయి.  పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ప‌రిష్కార‌మ‌వ‌వుతాయి.  తండ్రి వైపు నుంచి ఆస్తి ల‌భిస్తుంది.  ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్ రావ‌డంతో పాటు వేత‌నం పెరుగుతుంది. వ్యాపార‌స్తులు కొత్త‌గా పెట్టుబ‌డులు పెడ‌తారు.  విదేశాల‌లో ఉద్యోగం చేసే వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కెరీర్ ప‌రంగా ఆలోచించినిర్ణ‌యం తీసుకోవాల‌ని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

 క‌ర్కాట‌క రాశిః  శుక్రుడు.. శ‌ని గ్ర‌హాలు కుంభ‌రాశిలో సంచ‌రించ‌డం వ‌ల‌న క‌ర్కాట‌క రాశి వారికి కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి.  కెరీర్ లో మంచి మార్పులు క‌లుగుతాయి.  ఉద్యోగ‌స్తుల‌కు.. వ్యాపార‌స్తుల‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్య‌క్తిగ‌త జీవితంలో ఆవేశంతో ఎలాంటి నిర్ణ‌యాలు  తీసుకోవద్దు. పెండింగ్ ప‌నులు అతిక‌ష్టంమీద పూర్తి చేయ‌గ‌లుగుతారు.  ఉద్యోగ‌స్తులు ఎవ‌రితోనూ ఎలాంటి వాద‌న‌లు పెట్టుకోవ‌ద్ద‌ని పండితులు సూచిస్తున్నారు.  వ్యాపార‌స్తులకు మిశ్రమ ఫ‌లితాలుంటాయి.  స‌మాజంలో కీర్తి గౌరవం పొందుతారు. 

సింహ‌రాశిః ఈ రాశి వారికి కుంభ‌రాశిలో శుక్రుడు.. శ‌ని సంచారం వ‌ల‌న పెళ్లి కోసం ఎదురు చూస్తున్న సింహ‌రాశి వారికి మంచి సంబంధం కుదురుతుంది.  ఆఫీసులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గ‌డుపుతారు. మీ ల‌క్ష్యాన్ని చేరుకునే దిశగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తారు.  ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి పెరుగుతుంది.  ప్రేమ వ్య‌వ‌హారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్ప‌డుతాయి.. కాని వాటిని చ‌ర్చించి ప‌రిష్క‌రించుకోండి. కొత్త‌గా వ్యాపారం ప్రారంభించేందుకు ప్లాన్ చేయండి..

కన్యారాశిః కుంభ‌రాశిలో .. శుక్రుడు.. శ‌ని గ్ర‌హాలు సంచారం వ‌ల‌న క‌న్యారాశి వారు కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.  త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే పెట్టుబ‌డి పెట్టిన సొమ్ము న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.  ఉద్యోగ‌స్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్య‌త‌లు తీసుకొనే అవ‌కాశం క‌ల‌దు.  ఆదాయం పెరుగుతుంది.  ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.  వ్యాపార‌స్తులు కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్టేవిష‌యాన్ని వాయిదా వేసుకోవ‌డం  మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ విష‌యాలు కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి.

తులారాశి: కుంభ‌రాశిలో శుక్ర‌, శ‌ని క‌ల‌యిక‌... తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  సంతానం కోసం ఎదురు చూసే వారు శుభ‌వార్త వింటారు.  వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి.  కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్టేందుకు జ‌న‌వ‌రి 2025 మొద‌టి వారం చాలా అనుకూలంగా ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకోకుండా ఆర్డ‌ర్లు వ‌స్తాయి. కొత్తగా ఇల్లు క‌ట్టేందుకు అంకురార్ప‌ణ చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తులకు ప‌నిభారం అధిక‌మ‌వుతుంది.  స‌హోద్యోగ‌ల అండ‌దండ‌లు ఉంటాయి.  మీ బాస్ మీకు కొన్ని కీల‌క‌మైన ప‌నులు అప్ప‌గించే అవ‌కాశం ఉంటుంది.  ఇది మీ లైఫ్ న‌కు ట‌ర్నింగ్ పాయింట్ కూడా అవ్వ‌వ‌చ్చు. కాబ‌ట్టి అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను ఇష్టంగా స్వీక‌రించండి. 


వృశ్చిక రాశిః  ఈరాశిలో శుక్రుడు.. శ‌ని సంచారం వ‌ల‌న .. ఇప్ప‌టి వ‌ర‌కు అస్తిరంగా ఉన్న ఉద్యోగంలో.. స్థిర‌త్వం ఏర్ప‌డుతుంది.  వేత‌నం పెరుగుతుంది.  పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు మెరుగైన ఫలితాలనిస్తాయి. . వృత్తి, వ్యాపారాలు కూడా ఆర్థిక సమస్యలను, ఒత్తిళ్లను అధిగమించే సూచనలున్నాయి. వ్యాపార‌స్తుల‌కు లాభం రాక‌పోయినా న‌ష్టం ఉండ‌దు.  

ధ‌న‌స్సు రాశిః  ఈ రాశి వారికి కుంభ రాశిలో శుక్రుడు.. శ‌ని సంచారం వ‌ల‌న కొన్ని ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివాదాలు ఏర్పడుతాయి.  ఆస్తుల మ‌ధ్య వివాదాలు వ‌స్తాయి.  2025 సంక్రాంతి పండుగ త‌రువాత కొంత ఊర‌ట ల‌భించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు. స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో అనవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి.   ఈ కాలంలో అనవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎవ‌రితోనూ ఎలాంటి వాద‌న పెట్టుకోకుండా దైవ చింత‌న‌తో గ‌డ‌పండి . దేవుడిపై భారం వేసి మీ ప్ర‌య‌త్నాల‌ను మీరు కొన‌సాగించండి  కాల‌మే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతుంది.  వ్యాపార‌స్తులు ఎట్టి ప‌రిస్థితుల్లో కొత్త పెట్టుబడులు పెట్ట‌వ‌ద్ద‌ని పండితులు సూచిస్తున్నారు. 

మ‌క‌ర‌రాశిః శుక్రుడు... శ‌ని గ్ర‌హాలు క‌లిసి సంచ‌రిండం వ‌ల‌న మ‌క‌ర‌రాశి వారికి సంతోషం... ధ‌న సంప‌ద ల‌భిస్తాయి.  దైవానుగ్ర‌హంతో పెండింగ్ ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. ఉద్యోగం మారే అవ‌కాశం ఉంటుంది.  మీరు కోరుకున్న ఉద్యోగం ల‌భించ‌డంతో మీ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు.  కుటుంబంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. వ్యాపారస్తులు..కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్ట‌డం.. మ‌రో షాపును ప్రారంభించ‌డం లాంటివి జ‌రుగుతాయి.  ఈ రాశి వారికి పెద్ద మొత్తంలో లాభం వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

కుంభ‌రాశిః ఇది శ‌ని గ్ర‌హం స్వంత రాశి...శుక్రుడు..శ‌ని గ్ర‌హాలు ఈ రాశిలో సంచ‌రించ‌డం వ‌ల‌న కుంభ‌రాశి వారికి చాలా శుభ ఫ‌లితాల‌ను ఇస్తుంది. జీవిత‌భాగ‌స్వామికోసం స‌మ‌యాన్ని కేటాయిస్తారు. ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది.  కొన్ని కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆనందంతో పాటు సంప‌ద పెరుగుతుంది.  పెండింగ్ ప‌నులు పూర్తికావ‌డంతో కొంత ఊర‌ట క‌లుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. 

మీనరాశిః  కుంభ రాశిలో శుక్రుడు.. శ‌ని సంచారం వ‌ల‌న మీన రాశి వారికి  ఆర్థిక పరంగా స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చులు పెరుగుతాయి.  కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఏర్ప‌డుతాయి.  ఆర్థిక విష‌యాల్లో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోండి. కుటుంబ స‌భ్య‌ల మ‌ధ్య వివాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.  మీలో మీరే కూర్చుని ప‌రిష్క‌రించుకోండి.. మూడో వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు ప‌రిష్కారం కోసం వెళ్ల‌వ‌ద్ద‌ని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ‌.. పెళ్లి విష‌యాల‌ను వాయిదా వేసుకోండి. జ‌న‌వ‌రి చివ‌రి వ‌ర‌కు ప్రేమికులు ఎలాంటి సంభాష‌ణ‌లు.. మీటింగ్ లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఉద్యోగ‌స్తులు ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయాల్సి ఉంటుంది.