Good Health: చెప్పుల్లేకుండా వాకింగ్ చేస్తే .. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

హైటెక్  యుగంలో జనాలు ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు సాధారణంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటారు.   ఉదయం వేళ 30 నిమిషాల నుంచి గంట వరకు నడుస్తూ ఉంటారు.  అయితే వాకింగ్ సమయంలో కొంతమంది చెప్పులు వేసుకుంటే.. మరికొంత షూస్ వేసుకుంటారు.  ఇంకొంతమంది షూస్ వేసుకుని లేస్ కట్టుకుంటారు.  అయితే ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం చెప్పులు.. షూస్ లేకుండా నడిస్తే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. 

 హెల్తీగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం అత్యధిక మంది చేసే సులువైన వ్యాయామం వాకింగ్. కంటి చూపు మెరుగుదల మొదలుకొని గుండె ఆరోగ్యం వరకు నాడుల్ని ప్రేరేపించగల సామర్థ్యం ఉదయపు నడకకు ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది బూట్లు లేదా చెప్పులు లేకుండా నడిచినప్పుడు మాత్రమే అధిక ప్రయోజనాలు కలిగిస్తుంది. చాలామంది పాదాలు కంది పోతాయనో, దెబ్బలు తగులుతాయనో షూస్ ధరించి వాకింగ్ చేస్తుంటారు. గరుకైన ప్రదేశాల్లో, రాళ్లు తేలిన రోడ్డులో నడిస్తే అలా జరిగే అవకాశం తప్పక ఉంటుంది. కానీ సాధారణ నేలపై, వాకింగ్ ట్రాక్ లపై షూస్ లేకుండా నడిచినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఒట్టికాళ్లతో నడిస్తేనే మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. పైగా ఇలా చేయడంవల్ల బాడీలో బ్లడ్ సర్క్యూట్ సక్రమంగా జరుగుతుంది. పాదాలు, కాళ్లు, మోకాళ్లు, కీళ్లు బలంగా తయారవుతాయి.

పచ్చటి గరికపై నడిస్తే..

పచ్చటి గరిక, మట్టి, ఇసుక వంటి ఉపరితలాలపై ఒట్టికాళ్లతో నడవడంవల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.. అరిపాదాలపై ఒత్తిడి పెరిగి, నరాలు ఉత్తేజితం అవుతాయని, దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా మెదడు పనితీరులోనూ మార్పు వస్తుంది.. యాక్టివ్నెస్ పెరుగుతుంది.  ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం, సూర్య రశ్మికి గురికావడం మూలంగా శరీరంలో మెటలోనిన్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగు పర్చి సంతోషంగా ఉండేలా చేస్తుంది.

కంటి చూపు, గుండె ఆరోగ్యంపై ప్రభావం

షూస్ లేకుండా నడవడంవల్ల అరికాళ్లలలోని రిఫ్లెక్స్ పాయింట్స్పై సానుకూల ఒత్తిడి పెరుగుతుంది. మన పాదాల మొదలుకొని శరీరంలోని వివిధ భాగాలతో పాటు కంటి నరాలు కూడా లింక్ చేయబడి ఉంటాయి. ఈ విధమైన నడకతో రక్త ప్రసరణ పెరిగి కళ్లకు అక్సిజన్ సప్లై మెరుగు పడుతుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే బేర్పుట్ వాకింగ్ వల్ల రక్తంలో కొవ్వు పేరుకుపోయి అటంకం కలిగించే పరిస్థితులు దూరం అవుతాయి. రక్తం పలుచగా మారడంవల్ల గుండెకు మేలు జరుగుతుంది. హైపర్ టెన్షన్, హై బీపీ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బయోలాజికల్ రిథమ్ను మెరుగు పడటం కారణంగా నిద్ర బాగా పడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

షూస్ లేకుండా నడకవల్ల శరీరం స్వయం ప్రేరేపితంగా వ్యవహరిస్తుంది. ఎలక్ట్రాన్లను విడుదల చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి పాదాలు నేలకు తాకకుండా దీర్ఘకాలంపాటు ఉంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ పరిశోధకులు స్టడీలో వెల్లడైంది. ఎందుకంటే ఈ పరిస్థితివల్ల శరీరంలో ఎలక్ట్రాన్లు రిలీజ్ కావు. ఫలితంగా మైటో కాండ్రియా బలహీన పడుతుంది. ఇలా జరిగితే అస్తమా, అల్సర్లు, అలసట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే బేర్ వాకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిమెన్షియా, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేయడంలోనూ చెప్పులు లేదా షూస్ లేకుండా నడిచే విధానం అద్భుతంగా పనిచేస్తుంది.