వీడీసీల ఇసుక దందా.. ఇసుక రవాణాకు ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెండర్లు

  •      వేలం పేరిట అక్రమార్కుల నుంచి వీడీసీలకు ముడుపులు.. 
  •      పట్టించుకోని ఆఫీసర్లు 

జగిత్యాల/రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాకు గ్రామాల్లో వీడీసీలు అండగా ఉంటున్నాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను వ్యాపారంగా మార్చుకొని రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వీడీసీలు ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెండర్లు పిలుస్తూ అక్రమార్కులకు వంతపాడుతున్నాయి. వేలం దక్కించుకున్న అక్రమార్కులకు కొందరు అధికారులు సైతం అండగా నిలుస్తుండడంతో యథేచ్ఛగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు.  

విచ్చలవిడి తవ్వకాలతో కాసుల పంట 

జగిత్యాల జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలతోపాటు వాగులు కూడా చాలానే ఉన్నాయి. వీటిల్లోని ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. కోరుట్ల మండలం నాగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కల్లూరు, జోగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఆత్మనగర్, జగ్గసాగర్, కొండ్రికర్ల, ఆత్మకూర్, రామలచ్చక్కపేట, రాజేశ్వర్ పేట, ఆరెపేట గ్రామాల్లో పెద్దవాగు ప్రవహిస్తుంటుంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​మండలాల్లోని చాలా గ్రామాల్లో వాగులతోపాటు గోదావరి పరివాహక గ్రామాల నుంచి ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. 

వీడీసీల దందా 

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో వీడీసీలు ఏర్పాటు చేసుకొని ఇసుక అక్రమ రవాణాకు బహిరంగ టెండర్లు వేసి వేలం ద్వారా రూ.లక్షలు పొందుతూ ఇసుక అక్రమ రవాణాకు అనుమతులు ఇస్తున్నారు. ఇదంతా ఇల్లీగల్ గా జరుగుతున్నా మామూళ్ల మత్తులో ఆఫీసర్లు చూసీచూడకుండా వ్యవహరిస్తున్నారు. గ్రామాభివృద్ధి పేరిట వెలసిన కమిటీల్లో కొందరు మామూళ్లను ఆశగా చూపి ఆఫీసర్లను మచ్చిక చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో, మెట్ పల్లి మండలం రామలచ్చక్కపేట, ఆత్మనగర్ గ్రామాల్లోని  వీడీసీలు రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పైగా వేలం ద్వారా అక్రమ రవాణాకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 

అనుమతి పేరిట అడిషనల్​ట్రిప్పులు

రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందిన ట్రిప్పులకు రెట్టింపుగా ఇసుక రవాణా కొనసాగుతోంది. ఒక్క ట్రాక్టర్ ట్రిప్పునకు అనుమతి పొంది ట్రాక్టర్ యాజమానులు కొందరు అదే అనుమతితో అదనపు ట్రిప్పులు అక్రమంగా తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. సర్కార్ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వద్ద నుంచే ఇసుక తరలించాల్సి ఉండగా పరిసర గ్రామాల్లోని వాగులు, గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్నారు. వాగుల నుంచి తరలించే ఇసుక రకాన్ని బట్టి ట్రిప్పునకు రూ.1800 నుంచి రూ.4500 వసూలు చేస్తుండగా, వీడీసీల వేలం ద్వారా అనుమతి పొందిన అక్రమార్కులు అదనంగా రూ.500 నుంచి రూ.700 వరకు దండుకుంటున్నారు. దందా రాత్రి వేళల్లో, సెలవుదినాల్లో జోరుగా సాగుతోంది.