Samsung Triple fold screen: ఫోల్డబుల్ టెక్నాలజీలో కొత్త శకం..శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ లాంచ్!

ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Galaxy Z Series  సక్సెస్ తర్వాత శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణల్లో దూసుకెళుతోంది. శాంసంగ్ కంపెనీ అదిరిపోయే ట్రిపుల్  ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ కు శరవేగంగా పనిచేస్తుంది. ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ప్రాజెక్టుతో ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అగ్రగామి అయిన Huawei Mate XT అల్టిమేట్ తో పోటీయే లక్ష్యంగా పనిచేస్తుంది. 

శాంసంగ్ అందిస్తున్న ఈ ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ రెండు మడతలతో వస్తోంది. యూజర్లకు వినూత్న మైన డిజైన్  తో మడతపెట్టబడిన కాంపాక్ట్ ఫర్మ్ ఫ్యాక్టర్ తెరిచినప్పుడు పెద్ద డిస్ ప్లేతో యూజర్లకు కొత్తరకం అనుభూతిని అందిస్తుంది. 

Galaxy Z సక్సెస్ తో.. 

Galaxy Z సిరీస్ తో శాంసంగ్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన సత్తా ఏమిటో చూపించింది. అయితే ఫోల్డబుల్ కొత్త మోడళ్లను అందించడంలో కస్టమర్లను కొంత నిరాశపర్చింది. ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేయడం ద్వారా శాంసంగ్ పోటీదారులను ఛాలెంజ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున యూజర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

Huaweis Mate XT Ultimate  ఓ బెంచ్ మార్క్ ..

ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్లకుపెట్టింది పేరు  Huaweis Mate XT అల్టిమేట్. ఈ స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసినప్పుడు 10.2 అంగుళాల డిస్ ప్లేతో  ఆకట్టుకునే ప్రత్యేకతలతో కస్టమర్లను Huaweis Mate XT అల్టిమేట్ స్మార్ట్ ఫోన్ ఔత్సాహికుల దృష్టిని బాగా ఆకర్షించింది. శాంసంగ్ రాబోయే ట్రిపుల్ ఫోల్డ్ డివైజ్.. Huaweis Mate XT అల్టిమేట్ తో పోటీపడే ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది. 

స్మార్ట్ ఫోన్ డిజైన్ లో సరికొత్త బౌండరీ.. 

ట్రిపుల్ ఫోల్డ్ డివైజ్తో స్మార్ట్ఫోన్ డిజైన్ రూపకల్పనలో శాంసంగ్ సిగ్నిఫికెంట్ స్టెప్ వేసిందని చెప్పొచ్చు. శాంసంగ్ కంపెనీ కొత్త ఆవిష్కరణలు, అన్వేషణల ద్వారా ఫోల్డబుల్ టెక్నాలజీకి మంచి  భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేస్తోంది.