WhatsApp: కొత్త ఏడాది కొత్త ఫోన్ కొనాల్సిందే.. డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

కొత్త సంవత్సరం వస్తోంది.. మొదటి రోజు స్నేహితులకు, కుటుంబసభ్యులకు వాట్సప్ నుంచి మెసేజులు పంపి 'న్యూ ఇయర్ విషెస్' చెపుదాం అనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ అందుతోంది. డిసెంబర్ 31 తరువాత కొన్ని శామ్‌సంగ్ గెలాక్సీ మోడళ్లతో సహా పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట. ఈ మోడళ్లు వాడుతున్న వారందరూ వాట్సప్ కావాలంటే.. కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనక తప్పదు.

2025, జనవరి 1 నుండి 20కి పైగా స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ ఉపయోగించలేరని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా Android పాత వెర్షన్లు Android KitKat(2013), అంతకు ముందు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తున్న ఫోన్లు వీటిలో ఎక్కువగా ఉన్నాయి. Samsung, LG,  Sony వంటి టాప్ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

డిసెంబర్ 31 తరువాత వాట్సప్ పనిచేయని స్మార్ట్‌ఫోన్ల జాబితా 

  • Samsung: Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini
  • Motorola: Moto G (1వ తరం), Razr HD, Moto E 2014
  • HTC: One X, One X+, Desire 500, Desire 601
  • LG: Optimus G, Nexus 4, G2 Mini, L90
  • Sony: Xperia Z, Xperia SP, Xperia T, Xperia V  

మరోవైపు, టెలిగ్రామ్ లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న స్కామ్‌ల గురించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది . స్కామర్ల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని DoT సూచించింది.