Samsung Galaxy Tab S10 సిరీస్‌ వచ్చేసింది..AI ఫీచర్లతో..వివరాలివిగో

Samsung తన కొత్త మోడల్ ట్యాబ్ లను రిలీజ్ చేసింది. Galaxy Tab S10 సిరీస్ లో Galaxy Tab S10+, Galaxy Tab S10 Ultra రెండు మోడళ్లు భారత్ విడుదల చేసింది.ఈ బ్రాండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో రూపొందించబడ్డాయి.రెండు ట్యాబ్ లు కూడా Galaxy AI తో వస్తున్నాయి. ఇది సామ్ సంగ్ కంపెనీ డివైజ్లలో ఇన్ బుల్ట్గా రూపొందించిన స్మార్ట్ ఫీచర్ల సూట్లో భాగం.

ఈ రెండు ట్యాబ్లలో డైనమిక్ AMOLED 2X డిస్ ప్లేలు, పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్లు, S పెన్ కు పూర్తి మద్దతు వంటి హై ఎండ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. 

స్పెసిఫికేషన్లు

Galaxy Tab S10+ ట్యాబ్12.4 అంగుళా స్క్రీన్ తో 2800x1752 పిక్సెల్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఇది 12MP ఫ్రంట్ ఫేసింగ్ అల్ట్రావైడ్ కెమెరాలతో పాటు 13మెగాపిక్పెల్ మెయిన్ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో సహా డ్యుయెల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం 5G, WiFi6E, బ్లూటూత్ 5.3కి మద్దతునిస్తుంది.దీంతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 10090mAh బ్యాటరీతో ఎక్కువ కాలం ఛార్జింగ్ ఉంటుంది. 

Galaxy Tab S10 Ultra  ట్యాబ్ 2960x1848 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 14.6-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది S10+ వలె అదే వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కానీ నాచ్‌లో ఉంచబడిన డ్యూయల్ 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను అందిస్తుంది. అల్ట్రా వేరియంట్ Wi-Fi 7కి మద్దతు ఇస్తుంది. ఇది S10+లో కనిపించే Wi-Fi 6Eపై అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 11,200mAh బ్యాటరీతో ఎక్కువ కాలం ఛార్జింగ్ ఉంటుంది. 

సర్కిల్ టు సెర్చ్, స్కెచ్ అసిస్ట్, నోట్ అసిస్ట్ , PDF ఓవర్‌లే వంటి సాధనాలను అందించే Galaxy AI కొత్త సిరీస్ స్పెషల్ ఫీచర్. S-పెన్ ఇప్పుడు AI తో పనిచేసే ఎయిర్ కమాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. మెనుల ద్వారా నావిగేట్ చేయకుండా ఈ స్మార్ట్ ఫీచర్లను త్వరగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

ధర ఎంతంటే.. 

ధరల పరంగా Samsung Galaxy Tab S10+ (Wi-Fi వేరియంట్) 12GB RAM , 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 90,999 నుండి ప్రారంభమవుతుంది అయితే 5G- మోడల్ ధర రూ.1లక్షా04వేల999. Galaxy Tab S10 Ultra బేస్ Wi-Fi మోడల్(12GB RAM + 256GB స్టోరేజ్‌తో) ధర రూ.1లక్షా08వేల999. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే.. 512GB వేరియంట్ ధర రూ.1లక్షా19వేల999. అల్ట్రా 5G మోడల్‌లు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ బట్టి రూ.1లక్షా 22వేల 999, రూ.1లక్షాల33వేల999లు. 

ఈ టాబ్లెట్లను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లు కాంప్లిమెంటరీ 45W ట్రావెల్ అడాప్టర్‌ ఫ్రీ. దీని విలువ రూ.3వేల499 ఉంటుంది. Galaxy Tab S10 సిరీస్  రెండు రంగుల్లో లభిస్తోంది. కలర్లు: మూన్‌స్టోన్ గ్రే, ప్లాటినం సిల్వర్.