Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్‌తో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్

ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ శామ్ సంగ్.. గెలాక్సీ S25 సిరీస్ ను కొత్త సంవత్సరంలో ప్రారంబించేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త గెలాక్సీ S25 స్లిమ్ స్మార్ట్ ఫోన్ కొత్త ఫీచర్లతో సరికొత్త కెమెరా టెక్నాలజీతో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అన్ని ఫోన్లకంటే అత్యంత స్లిమ్ డిజైన్, మనసు దోచుకునే స్పెసిఫికేషన్స్,  గ్రౌండ్ బ్రేకింగ్ ALoP(All Lens on Prism) కెమెరా టెక్నాలజీతో వస్తోంది. 

ఏంటీ ALoP టెక్నాలజీ.. 

Galaxy S25 స్లిమ్ అద్బుతమైన స్పెసిఫికేషన్ దాని వినూత్నమైన ALoP టెలిఫోటో కెమెరా టెక్నాలజీ. ఇప్పుడున్న సాధారణ కెమెరా సెటప్ వలె కాకుండా  ALop కెమెరా మాడ్యుల్ పొడువు చాలా తక్కువ. సొగసైన్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. 

అట్రాక్టివ్ స్లిమ్ డిజైన్

Galaxy S25 స్లిమ్ కేవలం 7mm మందం కలిగి ఉందని ప్రచారం జరుగుతోంది. అదేగనక నిజమైతే ఇది మార్కెట్లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా ఉండబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ప్రైమరీ కెమెరా 200MP మెగా పిక్సెల్ , 50MP మెగా పిక్సెల్ లతో అల్ట్రావైడ్ కెమెరా  ఉంటుంది. ఇకALoP టెక్నాలజీతో నడిచే టెలిఫోటో కెమెరా Galaxy S25 స్లిమ్‌ డివైజ్ స్పెషల్ అట్రాక్షన్.  అయితే ఈ Galaxy S25 సిరీస్ లో Galaxy S25 లేదా Galaxy S25+ మోడల్‌లలో స్పెసిఫికేషన్ అందుబాటులో ఉండదు.

Galaxy S25 లైనప్‌కి కాంపాక్ట్ అదనం

Galaxy S25 స్లిమ్ Samsung 2025 సిరీస్ లోని ఫ్లాగ్‌షిప్ Galaxy S25, Galaxy S25+ ,Galaxy S25 Ultraతో కలిపి లాంచింగ్ కానుంది. పేరుకు తగ్గట్టుగానే స్లిమ వేరియంట్ లేటెస్ట ఫీచర్లతో తేలికపాటి, తక్కువ మందంతో స్టైలీష్ గా రూపొందించబడింది. మంచి డిజైన్లను కోరుకునే కస్టమర్లకు ఆకర్షణీయమైన ఎంపిక. 

2025 ప్రారంభంలో లాంచ్ చేయబడుతుందని అంచనా వేయబడింది. ఈ రాబోయే డివైజ్ మరిన్ని వివరాల కోసం Samsung అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.