శాంసంగ్ మడత ఫోన్ ఇంత తక్కువకా.. చాలు.. చాలు.. ఈ మాత్రం చాలు..!

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్స్ సెగ్మెంట్లో హవా కొనసాగిస్తోంది. జనరల్గా మడత ఫోన్ల ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. కానీ.. శాంసంగ్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ను 2025లో మార్కెట్లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్లో ఈ చీప్ అండ్ బెస్ట్ ఫ్లిప్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఉండనుందని టెక్ సర్కిల్స్లో టాక్ ఉంది. 

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఎఫ్ఈ పేరుతో ఈ మడత ఫోన్ 2025లో మార్కెట్లోకి రానుందని తెలిసింది. ఫ్లిప్6 మోడల్తో పోల్చితే అంతకంటే తక్కువ ధరకే ఈ సరికొత్త మడత ఫోన్ అందుబాటులో ఉండనుందని సమాచారం. గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,09,999. ప్రస్తుతం రూ.89,999కి ధర తగ్గింది. ఇంతకంటే తక్కువ ధరకు ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అందించాలని, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లిప్ మొబైల్స్ను విరివిగా అలవాటు చేయాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ALSO READ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఏం జరుగుతోంది..

ప్రస్తుతం మార్కెట్లో 50 వేల లోపు దొరుకుతున్న ఫ్లిప్ ఫోన్ Motorola RAZR 50. ఈ ఫ్లిప్ ఫోన్ లాంచింగ్ ప్రైస్ రూ.64,999. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్తో పాటు రిటైల్ మార్కెట్లో కూడా రూ.49,999 రూపాయలకే అందుబాటులో ఉంది. శాంసంగ్ జెడ్ ఫ్లిప్6 ఫోన్తో పోల్చుకుంటే Motorola RAZR 50 కూడా దాదాపు సేమ్ ఫీల్ను ఇస్తుంది. పైగా.. శాంసంగ్ జెడ్ ఫ్లిప్6 ధరతో పోల్చితే అందులో సగం ధరకే Motorola RAZR 50 ఫోన్ లభిస్తుంది. శాంసంగ్ ఫోల్డబుల్ సేల్స్పై ఈ పరిణామం ప్రభావం చూపింది. దీంతో శాంసంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను 50 వేల లోపు ధరతో 2025లో లాంచ్ చేయాలని డిసైడ్ అయింది.