మీసేవ కేంద్ర నిర్వాహకులపై ఫిర్యాదు

గన్నేరువరం, వెలుగు: సర్టిఫికెట్లకు నిర్ధారిత రేట్ల కన్నా అధికంగా వసూళ్లు చేస్తున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సంపతి ఉదయ్ కుమార్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌  నరేందర్‌‌‌‌‌‌‌‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తహసీల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ సమీపంలో నిర్వహిస్తున్న మీసేవ కేంద్రంలో సర్టిఫికేట్లకు అదనంగా వసూల్‌‌‌‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సదరు నిర్వాహకుడు మరో ఐడీతో అతని తమ్ముడితో తహసీల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దనే ఆన్‌‌‌‌లైన్​సెంటర్‌‌‌‌‌‌‌‌లో అక్రమంగా మీ సేవ నిర్వహిస్తున్నాడన్నారు. అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.