డిచ్‌పల్లి, వెలుగు : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో గురువారం రాత్రి స్టూడెంట్స్‌కు వడ్డించిన సాంబార్‌లో పురుగు వచ్చింది. దీంతో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఆఫీసర్లు తమ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ తరచూ కీటకాలు వస్తున్నారని ఆవేదన చెందారు. గతంలో భోజనంలో బల్లి రాగా సంబంధిత కుక్‌పై చర్యలు తీసుకున్నారు.
అయినా సిబ్బందిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. వర్సిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.