Samantha: తల్లిని కావాలనుంది.. అందుకు వయసు అడ్డుకాదు: రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత

అమ్మతనంలో ఉండే మాధుర్యమే వేరు. బిడ్డను లాలించి.. ఊరించి.. బుజ్జగించి.. చిలిపి చేష్టలను ఎంజాయ్ చేయడం.. వాళ్లు ప్రయోజకులయ్యే వరకు మార్గదర్శిగా అదో అందమైన బాధ్యతాయుత అనుభూతి.

స్టార్ హీరోయిన్ సమంతకు (Samantha Ruth Prabhu) ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ' ఎప్పటికైనా తల్లిగా ఉండటాన్ని నేను ఇష్టపడతానని చెబుతోంది. సిటాడెట్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

సిటాడెల్లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది. తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు. తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను.

అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది. గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో సామ్‌ నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’. నవంబర్ 7న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోవేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చి దూసుకెళ్తోంది.

కథేంటంటే::

సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకుంటుంది హనీ (సమంత రూత్ ప్రభు). ఇక బన్నీ (వరుణ్ ధావన్) సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ సినిమా సెట్స్‌లో లవ్‌లో పడతారు. అయితే.. బన్నీ స్టంట్ మాస్టర్‌గానే కాకుండా బాబా అలియాస్ గురు (కేకే మీనన్) స్థాపించిన ప్రైవేట్ సంస్థలో నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన హనీ జాబ్ కోసం బన్నీ చేస్తున్న సంస్థలోనే ఏజెంట్‌గా చేరుతుంది.

ఈ క్రమంలో హనీ, తన కూతురు నదియాని (కశ్వి మజ్‌ముందర్) చిన్నప్పటి నుంచి ఎంతోస్ట్రాంగ్గా పెంచుతోంది. కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ట్రైనింగ్ ఇస్తోంది. ఆమెకు 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేలా నేర్పుతోంది. అలాగే కశ్వి కరాటేలో బ్లాక్ బెల్ట్.. ఆమె పాత్ర ఈ వెబ్ సిరీస్‌కి స్ట్రాంగ్ పిల్లర్గా నిలుస్తోంది. అయితే, అనుకోకుండా అండర్ వరల్డ్‌ గ్యాంగ్ నదియాపై అటాక్ చేస్తారు.

ALSO READ | Chaitanya, Sobhita Wedding: రూమర్స్కు.. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు.. జరిగేది అక్కడే!

ఇక ఈ హానీ బన్నీ తమ ప్రేమతో ఒక్కటయ్యాక ఈ ఇద్దరూ నదియాని కాపాడేందుకు అండర్ వరల్డ్‌తో పోరాటం చేస్తారు. అయితే, నదియాకు వచ్చిన కష్టం ఏంటీ? నదియాను కాపాడటం కోసం వీళ్ళు ఎలాంటి పోరాటం చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు అండర్ వరల్డ్‌తో ప్రమాదం తెచ్చుకోవడానికి గల.. వారి వెనుకున్న గతం ఏంటి? అనేదే సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ స్టోరీ.