Honey Rose: నటి హనీ రోజ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. 30 మందిపై కేసులు.. ఒకరు అరెస్ట్

మలయాళ నటి హనీ రోజ్‌(Honey Rose)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం(జనవరి 6న) అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి, కుంబళానికి చెందిన షాజీ అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. 

ఇటీవలే హనీ రోజ్‌తన సోషల్ మీడియాలో ఓ వ్యాపారవేత్త వల్ల వేధింపులకు గురవుతున్నట్లు సుదీర్ఘ లేఖ‌లో తెలిపింది. 'అత‌డు తాను ఎక్క‌డ ఉంటే అక్క‌డికి వ‌చ్చేస్తున్నాడ‌ని, వెంబ‌డిస్తున్నాడ‌ని.. అస‌భ్య‌క‌ర రాత‌ల‌తో హింసించాడ‌ని ఆరోపించింది.. ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో తనను డబుల్‌ మీనింగ్‌తో పిలిచాడని..  మీడియా ముందు కూడా తనపై చులకన వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది. అసౌకర్యం అనిపించి.. ఆ బిజినెస్‌మెన్‌ ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేసినట్లు తెలిపింది. ఇక తన మౌనం చేతగాని తనం అనుకోవద్దని హెచ్చరించింది". అయితే హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్‌పై కొందరు అభ్యంతరకర కామెంట్స్ పెట్టారు. దీంతో తనపై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులతో పాటు లేఖ‌లో పేర్కొన్న వ్యాపారవేత్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ మేరకు ఆదివారం రాత్రి జనవరి 5న ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు వ్యాపారవేత్త షాజీని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిలోని కుంబళం ప్రాంతానికి చెందిన షాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భారతీయ న్యాయ చట్టంలోని లైంగిక వేధింపుల సెక్షన్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

ALSO READ | Fact Check: షారుఖ్ ఖాన్ భార్య మతం మార్చుకుందా..! అసలేం జరిగింది..?

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది మలయాళ బ్యూటీ హనీ రోజ్. సినిమాలో తన అందం, అభినయంతో ఆడియన్స్ మనసులు దోచేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో ఫుల్ బిజీ అవుతుంది ఈ బ్యూటీ అనుక్కున్నారంతా కానీ.. ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా దక్కలేదు. దీంతో మల్లి సొంత గూటికి వెళ్ళిపోయింది హనీ రోజ్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Honey Rose (@honeyroseinsta)