కామారెడ్డి టౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 20 రోజులుగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోలాటం, నృత్యాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము చేస్తున్న పోరాటంలో ఏ రాజకీయ నాయకులు లేరని, తమ పోరాటం స్వశక్తితో కూడుకుందన్నారు.
తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నేరవేర్చాలని, లేనట్లయితే జరిగే నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. సమ్మెకు పలు సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు.