క్రికెట్ టోర్నమెంట్​ విన్నర్ గా సలపూర్ జట్టు

నవీపేట్, వెలుగు : మండలంలోని యంచలో నిర్వహించిన అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ లో   నిర్మల్ జిల్లా సలపూర్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ లో మహారాష్ట్ర, నిజామాబాదు, నిర్మల్ జిల్లాల  నుంచి  54 జట్లు పాల్గొన్నాయి.  6 రోజుల పాటు మ్యాచ్ లు జరిగాయి.  

ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ లో నిర్మల్ జిల్లా ముధోల్ మండలం సలపూర్ జట్టు విజేతగా నిలువగా రూ. 21వేల నగదు,  ట్రోఫీ అందజేశారు.  రన్నర్ గా నిలిచిన  యంచ జట్టుకు రూ. 11 వేలు,   ట్రోఫీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ లహరి ప్రవీణ్,  గ్రామపెద్దలు పాల్గొన్నారు.