సద్గురు జగ్గీ వాసుదేవ్‪కి బ్రెయిన్ సర్జరీ

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బుధవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. సద్గురు ఆరోగ్య పరిస్థితిని ఆయన డాక్టర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి ఈరోజు సాయంత్రం వివరించారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర తలనొప్పితో బాధపడుతూ మార్చి 15న ఢిల్లీ అపోలో హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు గురుజీకి MRI స్కానింగ్ తీసి ఆయన మెదడులో వాపు, రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. 

రెండు సార్లు ఆయన బ్రెయిన్ లో బ్లీడింగ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీని వల్లనే ఆయనకు తీవ్ర తలనొప్పి వచ్చిందని, వెంటనే ఆయనకు బ్రెయిన్ సర్జరీ అవరసరమని డాక్టర్లు సూచించారు. ఢిల్లీ అపోలో హాస్పిటల్ వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం గురూజీ కోలుకుంటున్నారని ఆయన డాక్టర్ ప్రకటించారు.