ఎములాడలో సద్దుల బతుకమ్మ సంబురం

వెలుగు, వేములవాడ: బతుకమ్మ పాటలు, ఆడబిడ్డల ఆటలతో ఎములాడ రాజన్న సన్నిధి మార్మోగింది. వేములవాడ పట్టణంతోపాటు చుట్టుపక్కల ఊర్లలో మంగళవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడబిడ్డలందరూ ఆడిపాడారు. అనంతరం నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తే..  వేములవాడలో మాత్రం ఏడో రోజే జరుపుకుంటారు.