వరంగల్ జిల్లాలో సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలను పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేశారు. హనుమకొండలోని పద్మాక్షి గుండం, వరంగల్ లోని ఉర్సు రంగలీల మైదానం చెరువు లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు.  

వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీరా బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

 

 

 

 

 

 

 

 

వరంగల్​, నెట్ వర్క్