నిజామాబాద్​ జిల్లాలో.. ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలో సద్దుల బతుకమ్మ పండగను మహిళలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో బతుకమ్మను కొలిచి  సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగిస్తారు.  

మహిళలు, యువతులు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, చెరువులలో  నిమజ్జనం చేశారు.  

 

 

 

 

 

 

- వెలుగు నెట్​వర్క్​