రైతులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

 దేశ చరిత్ర లోనే  ఏక కాలంలో రూ 2 లక్షలు రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.  . ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి జండా చౌరస్తా వరకు రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన ..  జండా చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ  చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు  ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చెందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. . కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అన్నారు. పెద్దపల్లి జిల్లా లో లక్ష లోపు 29 వేల మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు.  .ఇంకా  2వేల  మంది రైతులకు కూడా రుణమాఫీ రావాల్సి ఉందంటూ.. ,దానికోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోచర్చిస్తానన్నారు. మూడు విడతల్లో  ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు.

ఒక జగిత్యాల అర్బన్ మండలం అంబారీ పెట్ రైతు వేదికలోజరిగిన  రైతు రుణమాఫీ  కార్యక్రమంలో రైతులతో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్,  అదనపు కలెక్టర్ రాంబాబు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేనివిధంగా 31 వేల కోట్లతో రుణమాఫీని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం  అమలు చేస్తుందన్నారు.జగిత్యాల నియోజకవర్గం లో9 వేల రైతు కుటుంబాలకు  రుణమాఫీ జరిగిందన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమవుతాయంటూ.....జగిత్యాల అర్బన్ మండలం లో 399  రైతు కుటుంబాలకు ఈరోజు రుణ విముక్తి కలిగింది...అప్పుల్లో కూరుకుపోయిన రైతును ఆదుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి  లక్ష్యమన్నారు.