బాంబ్ బ్లాస్ట్‎లో రష్యా అణు రక్షణ దళాల చీఫ్ ఇగోర్ కిరిల్లోవ్ హతం

మాస్కో: ఉక్రెయిన్‎తో యుద్ధం వేళ రష్యాకు భారీ షాక్ తగిలింది. రష్యా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‎లో బాంబ్ అమర్చి ఆయనను హతమార్చారు. క్రెమ్లిన్‌కు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్స్కీ ప్రాస్పెక్ట్‌లోని అపార్ట్‌మెంట్ భవనం సమీపంలో ఈ ఘటన చేసుకున్నట్లు రష్యా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అణు రక్షణ దళాల చీఫ్ ఇగోర్ కిరిల్లోవ్ హత్యపై రష్యా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ALSO READ : కెనడా ప్రధాని రాజీనామా చెయ్యాలి : జగ్మీత్ సింగ్

ఉక్రెయిన్‎తో యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ సొంత దేశంలో ఉన్నతాధికారి హత్యకు గురి కావడంతో రష్యాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇగోర్ కిరిల్లోవ్ హత్యపై పుతిన్ ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేస్తో్న్నట్లు అక్కడ స్థానిక మీడియా పేర్కొంది. ఇగోర్ కిరిల్లోవ్ హత్య వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు రష్యా ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇగోర్ కిరిల్లోవ్ హత్య రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.