Good News : క్యాన్సర్ కు వ్యాక్సిన్ వచ్చేసింది.. రష్యాలో ఫ్రీగా వేస్తున్నారు.. ఇండియాకు ఎప్పుడు..?

ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. 2023లోనే.. ఒక్క ఇండియాలోనే 15 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికిపైగా క్యాన్సర్ బారిన పడుతుండగా.. కోటి మంది వరకు చనిపోయారు. రాబోయే సంవత్సరాల్లో.. అంటే 2030 నాటికి క్యాన్సర్ నే ప్రతి ఏటా చనిపోయే వారి సంఖ్య కోటి 50 లక్షలకు చేరొచ్చని అంచనా.. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సిన్ పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా మొట్టమొదటి సారిగా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేసింది. రష్యాలోని ప్రతి ఒక్కరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయటానికి రెడీ అయిపోయింది. వైద్య రంగంలో ఇదో అద్భుతంగానే చెప్పొచ్చు..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి దేశాలన్నీ శ్రమిస్తున్న క్రమంలో రష్యా యావత్ ప్రపంచానికి ఉపశమనమిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ వ్యాక్సిన్ ను రూపొందించినట్లు తెలిపింది రష్యా. సోమవారం 
( డిసెంబర్ 18, 2024 ) రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. క్యాన్సర్ కు వ్యాక్సిన్ ను తయారు చేశామని.. రష్యాలోని క్యాన్సర్ రోగులకు వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రస్తుత ప్రిలినికల్ అధ్యయనాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి ఫస్ట్ రిజల్ట్ పొందే దిశగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు మురాష్కో. చాలా మంది శాస్త్రవేత్తల బృందాలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయన్న మురాష్కో.. ఈ వ్యాక్సిన్ ఎలాంటి క్యాన్సర్లను నయం చేస్తుందన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.

ALSO READ : రష్యా జనరల్ హత్య .. తామే చేశామని ప్రకటించుకున్న ఉక్రెయిన్

క్యాన్సర్ కు రష్యన్ సైంటిస్టులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని.. వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఫిబ్రవరిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాక్సిన్, రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నామని అన్నారు పుతిన్.

వ్యాక్సిన్ తయారీలో ఏఐ టెక్నాలజీ: 

వ్యాక్సిన్ తయారీ కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది రష్యా. సాధారణంగా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ చాలా పెద్ద ప్రాసెస్ అని.. ఇందుకోసం రష్యాకి చెందిన ఇవన్నికోవ్ ఇన్స్టిట్యూట్ తో ఒప్పందం చేసుకున్నామని.. ఏఐని ఉపయోగించి 30 నిమిషాల నుండి గంట లోపే వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది రష్యా.