అమ్మతోడు నిజం: సంసారానికి ఓ మంత్రిత్వ శాఖ.. ఫస్ట్ నైట్, హనీమూన్ ఖర్చులు ప్రభుత్వమే ఇస్తుంది..!

ఇప్పుడు దేశంలో క్రైం, అత్యాచారాలు, హత్యలు. దోపిడీలు వంటివి కాదు ముఖ్యం.. అంతకు మించి ఓ పెద్ద విపత్తు రాబోతున్నది. అది ఏంటో తెలుసా జనం.. అవును ఇప్పుడు ఉన్నట్లే ఉంటే.. రాబోయే 50 ఏళ్లల్లో భూమిపై ఉండేది అందరూ ముసలోళ్లే.. అవును.. ఇది పచ్చి నిజం. ఏంటీ ఇండియాలో ఇంత దారుణంగా ఉందా అంటే.. ఇది ఇండియా మేటర్ కాదండీ.. రష్యా గురించి.

రష్యా దేశంలో మెజార్టీ జనం పిల్లల్ని కనడం మానేశారు. డింగులు, బొంగులూ అంటూ కొందరు, పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగ్లమంటూ మరికొందరు పెళ్లీపెటాకులు లేకుండా లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారంట.. ఒక్క రష్యాలోనే కాదు.. యూరప్ దేశాల్లో, చైనా, అమెరికా దేశాల్లో జననాల రేటు దారుణంగా పడిపోయింది. ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈ భూమిపై 40 శాతం వృద్ధులే ఉంటారు.. ఇది మానవాళి మనుగడకే ముప్పు.. దీంతో రష్యా దేశం అప్రమత్తం అయ్యింది. సంసారానికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.. దానికో కేంద్ర మంత్రిని నియమించింది. ఆ విశేషాలే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ALSO READ | Laapataa Ladies: ఆస్కార్ 2025 'లాపతా లేడీస్' టైటిల్‌ చేంజ్.. ఇలా సడెన్గా ఎందుకు మార్చారంటే?

సంతానోత్పత్తిని ఎంకరేజ్ చేసే విధంగా అక్కడ సెక్స్, బుతుస్రావం వంటి అంశాలపై డాక్టర్లు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రష్యాలో జనాభాను పెంచడం కోసం శృంగారం ఎక్కడైనా చేసుకోవచ్చంట. ఒక్కమాటలో చెప్పాలంటే విచ్చలవిడి శృంగారానికి రష్యా ఆ దేశ ప్రజలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆఫీసులు, కాఫీ షాపులు, చివరికి జైల్లో ఉన్నవారు కూడా సంతానం కోసం కలవచ్చని రష్యా ప్రజలకు అనుమతి ఇచ్చేసింది. ఉద్యోగాలు చేసే దంపతులు భోజనం, కాఫీ బ్రేక్ టైంలో కూడా లైంగికంగా కలవచ్చని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.

రాత్రి 10 నుంచి 2 గంటల మధ్య ఇంటర్‌నెట్ బంద్
కపుల్స్ తమ దాంపత్య జీవితానికి, ఏకాంతంగా కలవడానికి ఇంటర్నెట్ అడ్డుగా నిలుస్తుందని రష్యా తేల్చింది. అందు కోసం రష్యా ప్రభుత్వం రాత్రి 10 నుంచి 2 గంటల మధ్య ఇంటర్‌నెట్‌ను బ్యాన్ చేయాలనే యోచనలో ఉంది.

ఇంటి పని, పిల్లలు పెంచే తల్లులకు ప్రోత్సాహకాలు
పిల్లల్ని కని ఇంటి పనులు, పిల్లలను పెంచడం వంటి పనులు చేసే మహిళలకు రష్యా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అలా పిల్లల్ని కని.. పెంచే వాళ్లకు రష్యా గవర్నమెంట్ బాగానే డబ్బులు ఇస్తోంది.

ఫస్ట్ డేటింగ్ చేస్తే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయ్
పెళ్లి అయిన వాళ్లకే కాదు.. పెళ్లి కాని వాళ్లకు కూడా రష్యా మంచి ఆఫర్ ఇచ్చింది. ప్రేమికులు ఫస్ట్ డేటింగ్ చేసుకున్నప్పుడు 5వేల రూబిన్స్ (అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.4,395 ఇస్తోంది.

పెళ్లయ్యాక మొదటి రాత్రి చేసుకుంటే ప్రభుత్వం నుంచి డబ్బులు
కొత్తగా పెళ్లైన జంటలకు ఫ్రీగా హోటల్స్ బుక్ చేస్తోంది. అంతేకాదు మొదటి రాత్రి కూడా రష్యా గవర్నమెంటే అరేంజ్ చేస్తోంది. ఫస్ట్ నైట్ ఫండింగ్ అని శోభనం జరుపుకునే జంటకు 26 రూబిన్స్ను ( ఇండియన్ కరెన్సీ రూ.23వేలు) ప్రభుత్వ అధికారులు చెల్లిస్తారు.