చెక్ బాక్సింగ్ చాంపియన్ గా రుషాంక్

బాన్సువాడ, వెలుగు: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఎమ్మెల్యే పోచారం మనమడు రుషాంక్ రెడ్డి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో కేరళకు చెందిన క్రీడాకారుడిపై విజయం సాధించాడు.

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ మహిళా విభాగంలో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారిణి వరల్డ్ చాంపియన్ ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్, సబ్ జూనియర్స్ విభాగం లో బాన్సువాడ కు చెందిన రుషాంక్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ పురుషుల విభాగంలో పిట్లంకు చెందిన విజయ్ రాఘవేంద్ర  2 సిల్వర్ మెడల్స్ సాధించారు.