ఇటీవల కాలంలో సోషల్ మీడియా హవా మరింత పెరిగిపోతుంది. తరచూ వినూత్న వీడియోలతో సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉన్నారు. ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో ఏ చిన్న పని చేసినా కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్ లను తెగ వాడేస్తున్నారు. అంతెందుకు సినిమాలు చూడడం కంటే ఈ మధ్య సోషల్ మీడియా చూడడమే విపరీతంగా పెరిగిపోతుంది. సినిమాల్లో మాదిరిగా విన్యాసాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతూ ఫేమస్ అయిన వ్యక్తులను ఎందరినో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తి చేసిన సాహసాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అంటేనే ప్రస్తుతం సాహసాలకు అడ్డాగా మారుతుంది. యాప్ ఓపెన్ చేస్తే చాలు.. ఏదో ఒక విన్యాసాలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి సైకిల్ పై చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా మంది భయబ్రాంతులకు గురిచేసే వీడియోలను చేస్తూ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ పై విన్యాసాలు ప్రదర్శించాడు. సైకిల్ ను పైకి ఎత్తుతూ ముందు టైర్ తీసి నడిపాడు. ముందు టైర్ తీయడంలో ఒక్కసారిగా అందరూ ఆశ్యర్యపోయారు. అనంతరం సైకిల్ తొక్కుతూనే టైర్ పైకి లేపి ఆ ముందు టైర్ ను చేతితో పట్టుకుని వెనక్కి వెళ్లాడు. అనంతరం మళ్లీ సైకిల్ ముందు భాగానికి మళ్లీ టైర్ ను జోడించాడు. ఇలా ఆ వ్యక్తి చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
That's really impressive ?
— Yogesh Kumar (@YKwolfpec) May 23, 2024
? Jake100 pic.twitter.com/Lmqk8TkmHg