లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ అక్కడిక్కడే మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.   చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టింది నల్లగొండ డీపోకి చెందిన ఆర్టీసీ  బస్సు. ఈ ఘటనలో   బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదం  సమయంలో  బస్సులో  40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సులు ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని  పోస్టుమార్టం కోసం  స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

ALSO READ | పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. పెద్ద ప్రమాదమే తప్పింది..