మహబూబాబాద్ జిల్లాలోపంచాయతీరాజ్​ రోడ్లకు రూ.56.23 కోట్ల నిధులు

  •  జిల్లాలో 42 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి చర్యలు
  • ఏజెన్సీ ఏరియాలో ఫారెస్టు క్లియరెన్స్​ రాక తప్పని తిప్పలు

మహబూబాబాద్​, వెలుగు: జిల్లాలోని వివిధ గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ నుంచి రూ56.23 కోట్ల నిధులు మంజురు అయ్యాయి. దీంతో లింక్​ రోడ్లు, గ్రామాలకు వెళ్లే రోడ్లకు శాశ్వత రోడ్లు రానున్నాయి. ఇప్పటికే గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వాన్న స్థితికి చేరుకోవడంతో జిల్లా పంచాయతీరాజ్​ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్​ చేశారు. దీంతో అత్యవసరమైన చోట్ల రోడ్ల పునరుద్దరణ కోసం, రోడ్ల నిర్మాణం కోసం ఫండ్స్​ మంజూరు చేశారు. 

అటవీ శాఖ క్లియరెన్స్​ రాక తప్పని ఇబ్బందులు

బయ్యారం మండంలో చోక్లాతండా నుంచి గురిమెళ్లకు వెల్లె రహదారి 15 కిలోమీటర్లకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరైనా అటవీ శాఖ క్లియరెస్స్​ రాకపోవడంతో కంకర పోసి వదిలేశారు. కొత్తగూడ మండంలో కొత్తపల్లి నుంచి దుబ్బగూడకు వెళ్లే రోడ్డు 40 కిలో మీటర్లకు రూ.39.82 కోట్లు మంజూరయ్యాయి.. 2020లో పనులు ప్రారంభమైనా 13కిలోమీటర్ల మేర పనులు పూర్తి కాగా ఇంకా 27 కిమీ పనులు పూర్తి కావాల్సి  ఉంది. కర్లాయి నుంచి ఊట్లకు 8 కిలోమీటర్ల రహదారికి 2018లో రూ.3.27 కోట్లు మంజూరు కాగా పనులు ముందుకు సాగడం లేదు. 

కిష్టాపురం క్రాస్​ రోడ్డు నుంచి బక్క చింతపల్లి రోడ్డుకు 2017లో రూ.48 లక్షలు మంజూరు కాగా పనులు పూర్తి కాలేదు. చెరువు ముందు తండా నుంచి దొరవారి వెంపల్లెకు 7.40 కిలోమీటర్ల రోడ్డుకు2018లో రూ.3.56 కోట్లు మంజూరైన పనులు పూర్తి కాలేదు. తిరుమలగండి నుంచి పుట్టలభూపతి వరకు 6 కిలోమీటర్లకు రూ2.65 కోట్లు 2019లో మంజూరైన పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క రోడ్ల నిర్మాణంకు క్లియరెన్స్​ కోసం రాష్ట్ర ఆఫీసర్లను ఒప్పించినా క్షేత్ర స్థాయిలో పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడంతో ఏజెన్సీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రోడ్ల నిర్మాణలు వెంటనే పూర్తి చేయాలి 

ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంను వెంటనే పూర్తి చేయాలి. ఫారెస్టు క్లియరెన్స్​ రాకపోవడం వల్ల అనేక చోట్ల పనులు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం ఫండ్​ మంజూరు చేసినా ఫలితం లేకుండా పోతుంది. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆఫీసర్లు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగి రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అయ్యేలా చర్యలను చేపట్టాలి.   - బండారి సోమరాజు,పోగుళ్లపల్లి. కొత్తగూడ మండలం

మండలాల వారిగా రోడ్లకు నిధుల కేటాయింపు వివరాలు

మండలం    కిలోమీటర్లు    ధులు (కోట్లలో)    కేసముద్రం    18.8     రూ.19.93
బయ్యారం    4.80    రూ.4.80 
గార్ల     1.2     రూ.65లక్షలు
 పెద్దవంగర    3.75     రూ.3.95 
 తొర్రూరు     1.75     రూ.1.90 
 డోర్నకల్     3.7     రూ.4.82 
 కురవి     8.50     రూ.10.18 
 గంగారం     –    రూ.6 కోట్లు
 కొత్తగూడ    –    రూ.4 కోట్లు 
మొత్తం     42 కిలోమీటర్లు     రూ.56.23 కోట్లు