బ్రహ్మణపల్లిలో రూ. 5.45 లక్షల నగదు సీజ్

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు: నిజాంసాగర్ మండలం బ్రహ్మణపల్లి చెక్ పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. నాందేడ్ జిల్లా కాందాహర్ తాలూకాకు చెందిన సమీర్ హుస్సేన్‌ తన బొలెరో వాహనంలో ఎలాంటి రసీదులు లేకుండా రూ. 5.45,000 తీసుకెళుతుండగా పోలీసులు తనిఖీ చేసి నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.