నేపాల్ యాత్రకు వెళ్లి.. కరీంనగర్ వాసి గుండెపోటుతో మృతి..

కరీంనగర్: నేపాల్ యాత్రకు వెళ్లిన ఓ కరీంనగర్ వాసి జనక్ పురి  ప్రాంతంలో గుండెపోటుతో మరణించిన సంఘటన ఆదివారం ( అక్టోబర్ 27) జరిగింది. కరీంనగర్ కు చెందిన నర్సింగరావు స్నేహితులతో కలిసి నేపాల్ కు విహారయాత్రకు వెళ్లారు. నేపాల్ లోని జనక్ పురి ప్రాంతంలో పర్యటిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.. స్పాట్ లో చనిపోయాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.