రాయల్‌ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ : స్టన్నింగ్ లుక్స్‌తో గెరిల్లా 450

బైక్స్‪లో మంచి క్రేజ్, రాయల్ లుక్, గ్రేట్ ఫర్‌ఫామెన్స్ కనిపించేది అంటే రాయల్‌ఎన్‌ఫీల్డ్.. ధర ఎక్కువగా ఉన్నా, మైలేజ్ తక్కువ ఇస్తున్నా రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్స్ సేల్స్ ఎక్కువగానే అవుతుంటాయి. ఎందుకంటే ఆ బైక్ కు ఉండే రైడింగ్ ఎక్స్‌పీరియన్స్, దర్జాతనం అలా ఉంటాయ్ మరి. 1901లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి మోటర్ బైక్స్ తయారు అవుతున్నాయి. అప్పటి నుంచి దాని ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పలు సినిమాల్లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ పై సాంగ్స్ కూడా వచ్చాయి. ఆ సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి.  తాజాగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ నుంచి 450 గెరిల్లా మోడల్ బైక్ లాంచ్ అయ్యింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ALSO READ | తెలంగాణ మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ బ్లాక్​ ఎడిషన్​ 

ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు గెరిల్లా 450ని విడుదల చేసింది. రాయల్‌ఎన్‌ఫీల్డ్ హంటర్ మార్కెట్ మంచి పేరు తెచ్చకుంది. సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. దీన్ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో డిజైన్ చేసి తయారు చేశారు. ఇండియాలో గెరిల్లా 450 వివిధ వేరియంట్ల -స్పెక్ షోరూం ధరలు ఇలా ఇన్నాయి. రూ.2.39 లక్షల నుండి ప్రారంభమై రూ.2.54 లక్షల వరకు ఉన్నాయి. ఇది ఐదు కలర్స్, 3 (అనలాగ్, డాష్, ఫ్లాష్) వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ తో 4 -ఇంచుల TFT డిస్‌ప్లేతో ఉంది. ఇది USB టైప్ -C ఛార్జింగ్ పోర్ట్, రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. 

రాయల్‌ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 స్పెసిఫికేషన్లు

  • 452cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 40bhp పవర్, 40Nm గరిష్ట టార్క్‌, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌
  • బ్రేకింగ్ విధులు 310mm వెంటిలేటెడ్ ఫ్రంట్ డిస్క్, 270mm వెంటిలేటెడ్ రియర్ డిస్క్ తో డ్యూయల్-ఛానల్ ABS 
  • 43mm ఫ్రంట్ ఫోర్క్స్‌తో 140mm ట్రావెల్, బ్యాక్  మోనోషాక్‌తో 150mm  షాక్ ఆబ్రషర్స్
  • గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ, బరువు 191 కిలోలు, 11-లీటర్ ట్యాంక్  కెపాసిటీ