వామ్మో: ఇదెక్కడి టీ రా నాయనా బాబూ.. రోస్ట్​ టీ అంట..

ఆఫీసులో షడన్​ గా  కొద్దిగా అనీజీ అనిపించినా.... పని ఒత్తిడి ఎక్కువై కాస్త అలసట అనిపించినా... రిలాక్స్​ కావాలన్నా దగ్గరులో ఉన్న టీ దుకాణానికి పరిగెడతాం.. అప్పుడు మైండ్​ ఫ్రెష్ అవుతుందనే భావన జనాల్లో సహజంగా ఉంటుంది.  అంతేకాదు పొద్దున్నే లేవగానే వేడి వేడి ఛాయ్​ కోసం తహతహ లాడుతుంటారు.  ఇలా టీలు చాలా రకాలుగా ఉంటాయి.  బాదంటీ, అల్లంటీ, లెమన్​ టీ, లైట్​ టీ ఇలా చాలా రకాలు ఉంటాయి.  కాని ఇప్పుడు మార్కెట్లోకి రోస్ట్​ టీ వచ్చింది.  అదేంటి టీని కాల్చడం ఏంటనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

   
 టీ తయారు చేయాలంటే పాలలో టీ పౌడర్, పంచదార వేసి మరగబెడతారు.. ఇప్పుడు కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది.. అదే రోస్టెడ్ మిల్క్ టీ.. టీని రోస్ట్ చేయడం ఏంటి? అని షాకవుతున్నారా? నిజమండి...  టీ పొడి లేదా తేయాకు, పంచదార,పాలు మరిగించి టీ తాగడం అందరికీ తెలుసు.. కానీ ఇవే పదార్ధాలను వేయించి టీ తయారు చేయడం మీకు తెలుసా? ఆశ్చర్యపోవద్దు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'రోస్టెడ్ మిల్క్ టీ' గురించి చదవండి.

తెల్లారితే టీ, లేదా కాఫీ తాగాల్సిందే. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. మసాలా టీ, అల్లం టీ, ఇలాచీ టీ ఇలా రకరకాల ఫ్లేవర్లలో టీలను టీ ప్రియులు ఇష్టపడతారు. అయితే ఇప్పుడు రోస్టెడ్ మిల్క్ టీ పేరుతో కొత్త టీ ట్రెండ్ అవుతోంది. టీ మరగపెడతాం కదా.. కాల్చడం ఏంటి? అని మీకు డౌట్ వస్తుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

రెగ్యులర్‌గా టీకి భిన్నంగా ఉంది ‘రోస్టెడ్ మిల్క్ టీ’ తయారు చేస్తారు.  ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ టీ తయారీలో తేయాకు, లేదా టీ పొడి, చక్కెర, యాలకులు పాన్‌లో పొడిగా వేయించడం కనిపించింది. చక్కెర పాకం వచ్చేవరకు వేయించి దానికి ఇతర పదార్ధాలను కలపడంతో అది కాస్త పేస్ట్‌గా మారిపోయింది. ఆ మిశ్రమానికి పాలను యాడ్ చేసి అప్పుడు మరిగించారు. మరిగిన టీని వడకడితే ‘రోస్టెడ్ మిల్క్ టీ’ తాగడానికి రెడీ అన్నమాట. రోస్టెడ్ మిల్క్ టీ తయారీ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టీ లవర్స్ దీనిపై విమర్శలు చేయడమే కాకుండా పలు సందేహాలు వ్యక్తం చేసారు.