గులాబీ మొక్కలకు..ఈ టైంలో నీళ్లు పోస్తే పూలు బాగా వికసిస్తాయి

గులాబీ పువ్వులు..ఈ పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు..తమకు ఇష్టమైన వారిని ఈ పువ్వులను ఇచ్చి ఇంప్రెస్ చేసుకుంటుంటారు. ఇక ప్రేమజంటల గురించి చెప్పాల్సిన పనిలేదు..కొందరు గులాబీ మొక్కలను పెంచడం ఓ హాబీగా పెట్టుకుంటారు. ఇంటి ఆవరణలో టెర్రస్లో తమకు ఇష్టమైన వివిధ రకాల గులాబీ మొక్కలను పెంచుతుంటారు. ఇటీవల కాలంలో ఎవరి ఇంట్లో చూసినా గులాబీ మొక్కలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి గులాబీ మొక్కలను  ఇష్టపడేవారు ఎక్కువగానే  ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరిలో గులాబీ మొక్కలను పెంచే పద్దతి గురించి ఎంతమందికి తెలుసు. గులాబీ మొక్కలకు నీరు ఎలా పెట్టాలి.. రోజుకు ఎంత మోతాదులో నీరు పెట్టాలి..ఏ సమయంలో నీరు పోస్తే గులాబీ లు పూలు బాగా వికసిస్తాయి.. ఇలాంటి విషయాల్లో కొంతమందికి అవగాహన లేకపోవచ్చు.. వీటి గురించి తెలుసుకుందాం. 

సాధారణంగా మొక్కలు వర్షాకాలం, చలికాలంలో నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎండకాలంలో ఎక్కువగా ఉంటుందని మనందరికి తెలుసు.. నీటి పరిమాణం మొక్కల పెరుగుదల, అభివృద్ధిని, సూర్యకాంతి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. వేసవి కాలంలో పూర్తిగా పెరిగిన గులాబీ మొక్కకు రోజు 1 లీటరు నీరు అవసరం ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సూర్యరశ్మీ ఉన్నపుడు గులాబీ మొక్కలకు ఎక్కువ మొత్తం నీరు అవసరం ఉంటుంది. గాలాబీ మొక్కలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నీరు పెడితే గులాబీ పూలు బాగా వికసిస్తాయి. రాత్రిపూట నీరు పెట్టకూడదు.