రూబిక్స్​ వర్సెస్ రోబో

  • రూబిక్స్ క్యూబ్​ని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. దీన్ని సెట్ చేయాలంటే కొందరికి కొన్ని గంటలు పడుతుంది. మరికొందరికి నిమిషాల్లో అయిపోతుంది. అలా ఫాస్ట్​గా సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్​లో చోటు సంపాదించిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే, ఇప్పుడు ఒక రోబో కూడా రూబిక్స్​ క్యూబ్​ని వేగంగా సాల్వ్ చేసింది. ఎంత వేగంగా అంటే.. 0.305 సెకండ్స్​లో. 
  • మిట్సుబిషి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్​కి చెందిన కాంపొనెంట్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ సెంటర్ దీన్ని చేసింది. రూబిక్​ క్యూబ్​ను సాల్వ్​ చేసి గిన్నిస్​ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. 
  • అయితే, ఇందులో వాడింది 3x3x3 పజిల్ క్యూబ్‌. సాధారణంగా ఈ క్యూబ్​ను మనిషి సాల్వ్ చేస్తే 4.48 సెకన్లు పడుతుంది. దీన్ని గతంలో చైనాకు చెందిన యిహెంగ్ వాంగ్ సాధించారు అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చెప్పింది.