కోయలగూడెం దగ్గర అర్థరాత్రి రోడ్డు ప్రమాదం..స్పాట్లోనే ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లో మృతిచెందారు. బస్సులో ఉన్న 11మందికి తీవ్రగాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం కోయలగూడెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం( సెప్టెంబర్27) అర్థరాత్రి ఆగివున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.11మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సకోసం సమీప ఆస్పత్రికి తరలించారు.