ట్రాక్టర్‌‌‌‌, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు మృతి

  • నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ప్రమాదం

హాలియా, వెలుగు : ట్రాక్టర్‌‌‌‌ ట్రాలీని బైక్‌‌‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సిరిసినగండ్ల గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. పెద్దవూర ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దవూర మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుడుం రామలింగయ్య (40), దారం రమేశ్‌‌‌‌ (36) బైక్‌‌‌‌పై కొత్తలూరు వైపు నుంచి బసిరెడ్డిపల్లికి వస్తున్నారు. 

ఇదే టైంలో ఓ ట్రాక్టర్‌‌‌‌ నువ్వుల కట్టెను లోడ్‌‌‌‌ చేసుకొని పెద్దగూడెం వైపు నుంచి కొత్తలూరు వైపు వస్తోంది. ట్రాక్టర్‌‌‌‌ ట్రాలీకి సంబంధించిన సైడ్‌‌‌‌ డోర్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేసి నువ్వుల కట్టెలను లోడ్‌‌‌‌ చేశారు. సిరిసినగండ్ల గ్రామ సమీపంలోకి రాగానే బైక్‌‌‌‌పై వస్తున్న రామలింగయ్య, రమేశ్‌‌‌‌కు ట్రాక్టర్‌‌‌‌ ట్రాలీ సైడ్‌‌‌‌ డోర్‌‌‌‌ తగిలింది. దీంతో వారు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లింగయ్య, రమేశ్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీలను నాగార్జునసాగర్‌‌‌‌లోని కమల హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భ్యుల ఎస్సై వీరబాబు తెలిపారు.